ఇటీవల భారీగా పెరిగిన బంగారం ధరలు వారం చివరలో మాత్రం పతనం అయ్యాయి. ఇటీవల ఓ సమయంలో రూ.48,000 క్రాస్ చేసిన గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న దాదాపు రూ.వెయ్యి పడిపోయింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న రూ.952.00 లేదా 2.00 శాతం క్షీణించి రూ.46,651.00 వద్ద ముగిసింది. అంటే నిన్న ఒక్కరోజే రూ.47,500 పై స్థాయి నుండి రూ.46,700 దిగువకు పడిపోయాయి. నిన్న రూ.47,500.00 వద్ద ప్రారంభమైన గోల్డ్ ఫ్యూచర్స్, రూ.47,574.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,556.00 కనిష్టాన్ని తాకింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.998.00 లేదా 2.09 శాతం క్షీణించి రూ.46,810 వద్ద ముగిసింది. రూ.47,734.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,766.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,677.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు ఏకంగా 1800 డాలర్ల పై స్థాయి నుండి 1765 డాలర్ల దిగువకు పతనమయ్యాయి. నిన్న ఒక్కరోజే 45.40 డాలర్లు పతనమై 1763.50 డాలర్ల వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా దాదాపు ఒక డాలర్ మేర పతనమైంది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.960 డాలర్లు లేదా 3.80% శాతం పతనమై 24.332 డాలర్ల వద్ద క్లోజ్ అయింది.

దేశ రాజధాని న్యూఢిల్లీలో బంగారం ధరలు శుక్రవారం రూ.285 క్షీణించి రూ.46,570 వద్ద ట్రేడ్ అయింది. వెండి ఏకంగా రూ.661 క్షీణించి రూ.65,500 వద్ద ట్రేడ్ అయింది. అమెరికా బాండ్ యీల్డ్స్ పెరుగుతున్న నేపత్యంలో బంగారం అమ్మకాలు వెల్లువెత్తినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications