న్యూఢిల్లీ: అమెరికా - ఇరాన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. రెండు రోజుల్లోనే 10 గ్రాముల పసిడి ఏకంగా రూ.1,800 పెరిగింది. ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్‌లో 10 గ్రాములు 2.3 శాతం (రూ.918) పెరిగి రూ.41,030కి చేరుకుంది. శుక్రవారం 2 శాతం (రూ.850) పెరిగింది. దీంతో ఈ రెండు రోజుల్లోనే ఏకంగా రూ.1,800 వరకు పెరిగింది. మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వెండి ధరలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. ఎంసీఎక్స్‌లో కిలో వెండి 2 శాతం (రూ.947) పెరిగి రూ.48,474కు చేరుకుంది.

ఈ రోజు మరెంత పెరగవచ్చునంటే?
డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం రూ.72 దాటింది. ఈ ప్రభావం బంగారంపై పడింది. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. బంగారం ధర ఈ రోజు రూ.41,300కు, వెండి ధర కిలో రూ.48,900కు చేరుకునే అవకాశాలు ఉన్నాయని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి.

గత వారం 2.3 శాతం మేర పెరుగుదల
వారంతంలో అమెరికా - ఇరాన్ ఉద్రిక్తతలతో పాటు వివిధ కారణాలతో గత వారం బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 2.3 శాతం మేర పెరిగాయి. ధరలు ఆరేడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం కూడా ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని బులియన్ మార్కెట్ అంచనా వేస్తోంది.

ఔన్స్ 1,573 డాలర్లు
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ 1.4 శాతం పెరిగి 1,573.14 డాలర్లకు చేరుకుంది. ఏకంగా 1.8 శాతం పెరిగింది. ఏప్రిల్ 10, 2013 తర్వాత అత్యంత గరిష్టానికి చేరుకుంది. ఏడేళ్ల క్రితం (ఏప్రిల్ 10, 2013) బంగారం 1,579.55 డాలర్ల వద్ద ఉంది. ఇప్పుడు సమీపంలో ఉంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.6 శాతం పెరిగి 1,577.80 డాలర్ల వద్ద ఉంది. గత ఏడాది రెండో అర్ధభాగంలో బంగారం 1,550కి చేరుకున్నాయి. ఇప్పుడు మరో 25 డాలర్లు అధికంగా పెరిగింది. ఇటీవలి వరకు 1,500 డాలర్ల లోపు కూడా ఉంది.

పల్లాడియం ఆల్ టైమ్ హిట్
ఇక మరో అత్యంత విలువైన లోహం పల్లాడియం 2,000 డాలర్లు దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 2,011.48 డాలర్లకు చేరుకోవడం ద్వారా జీవన కాల గరిష్టానికి చేరుకుంది. గతంలో దీని రికార్డ్ 2,006.32 వద్ద అల్ టై హైగా ఉంది. ఇప్పుడు దానిని కూడా దాటేసింది.

వెండి, ప్లాటినం ధరలు కూడా..
అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్స్ 2 శాతం పెరిగి 18.39 డాలర్లకు చేరుకుంది. ప్లాటినం 0.6 శాతం పెరిగి 985.87 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం సహా విలువైన లోహాలపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు.
More From GoodReturns

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications