బంగారం, వెండి ధరలు గురువారం భారీగా పెరిగాయి. నిన్న భారీగా తగ్గిన పసిడి ధరలు వెంటనే జంప్ చేశాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న ఏకంగా 800కు పైగా క్షీణించింది. వెండి కిలో రూ.1400 వరకు తగ్గింది. కానీ నేడు (నవంబర్ 15) ప్రారంభ సెషన్‌లోనే పసిడి రూ.400 వరకు పెరిగింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో ఇప్పటికీ రూ.5,000 తక్కువగా ఉంది. వెండి ఆల్ టైమ్ గరిష్టంతో రూ.18 వేల వరకు తక్కువగా ఉంది.

గోల్డ్ ఫ్యూచర్స్ జంప్
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.358.00 (0.70%) పెరిగి రూ.51,178.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.51,231 వద్ద ప్రారంభం కాగా, రూ.51,247 వద్ద గరిష్టాన్ని, రూ.51,161 వద్ద కనిష్టాన్ని తాకింది.
ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.341.00 (0.67%) పెరిగి రూ.51,318.00 ట్రేడ్ అయింది. రూ.51,404 వద్ద ప్రారంభం కాగా, రూ.51,411 వద్ద గరిష్టాన్ని, రూ.51,318 వద్ద కనిష్టాన్ని తాకింది. కరోనా కారణంగా బంగారం ధరలు ఈ ఏడాది భారీగా పెరిగాయి. రూ.40వేల లోపు ఉన్న పసిడి రూ.50వేల పైకి చేరుకుంది.

రూ.700 పెరిగిన వెండి
డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.601.00 (0.98%) పెరిగి రూ.61990.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.62,020.00 ప్రారంభం కాగా, రూ.62,165.00 వద్ద గరిష్టాన్ని, రూ.61,974.00 కనిష్టాన్ని తాకింది.
మార్చి ఫ్యూచర్స్ రూ.707.00 (1.12%) పెరిగి రూ.63755.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,636.00 ప్రారంభమైన ధర, రూ.63,755.00 వద్ద గరిష్టాన్ని, రూ.63,636.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లోను పెరుగుదల
అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లోను బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఔన్స్ డిసెంబర్ గోల్డ్ 0.60 శాతం పెరిగి 1,907.55 డాలర్లు పలికింది. 1,902.55 - 1,910.35 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో పసిడి 26 శాతం పెరిగింది. క్రితం సెషన్‌లో 1,896.20 డాలర్ల వద్ద క్లోజ్ అయింది.
ఔన్స్ సిల్వర్ 1.23 శాతం పెరిగి 24.188 డాలర్లకు పెరిగింది. 23.957 - 24.227 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 23.893 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో 35.03 శాతం పెరిగింది.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

బంగారం ధరల పెరుగుదలపై లేటెస్ట్ రిపోర్ట్.. సరికొత్త నివేదికను విడుదల చేసిన ప్రముఖ బ్యాంకులు

బంగారం ధరలపై దిమ్మతిరిగే న్యూస్.. పసిడి ధర భారీగా పెరగడానికి ఈ మూడే కారణం.. భవిష్యత్తులో కూడా..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పసిడి రేటు భారీ ర్యాలీతో ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 15, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు ర్యాలీ చేసిందంటే.. ఏప్రిల్ 11, శనివారం ధరలు ఇవే..

సముద్రం అడుగున సీక్రెట్ బంగారం ఫ్యాక్టరీ.. ప్రపంచానికి తెలియని షాకింగ్ నిజం.. బట్టబయలు చేసిన సైంటిస్టులు..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు తగ్గాయి. తాజా రేట్లు ఇక్కడ చూడండి

Today Gold Silver Rate Live: అమెరికా ఇరాన్ చర్చల తర్వాత పెరిగిన బంగారం ధరలు

Gold: బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? బిస్కెట్లు, కాయిన్స్ ఎక్కడ కొంటే ఎక్కువ లాభం?

Today Gold Silver Rate Live: బంగారం, వెండి ధరలు పతనం.. ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications