గత వారం రికార్డ్ హైకి చేరుకున్న బంగారం ధరలు వరుసగా మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా పసిడి భారీగా పెరిగింది. ఆ తర్వాత పరిస్థితి సానుకూలంగా ఉండటంతో బంగారంపై ఒత్తిడి తగ్గింది. మరోవైపు అమెరికా-చైనా మధ్య తదుపరి ట్రేడ్ డీల్ ప్రభావం కూడా ఉంది.

ఎంసీఎక్స్‌లో బంగారం ధర
మంగళవారం (జనవరి 14, 2020) ఎంసీక్స్‌లో గోల్డ్ ఫిబ్రవరి ఫీచర్స్ ధర 10 గ్రాములకు 0.51 శాతం తగ్గి రూ.39,345కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితి. ఎంసీఎక్స్‌లో కిలో వెండి 0.82 శాతం తగ్గి రూ.46,060కు చేరుకుంది. గత వారం ఎంసీఎక్స్‌లో బంగారం ధర రూ.41,293 రికార్డ్ హైకి చేరుకున్న విషయం తెలిసిందే. మూడు నాలుగు రోజుల్లో బంగారం ధర రూ.2,000 వరకు తగ్గింది.

అందుకే తగ్గాయి...
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా-చైనా మధ్య ట్రేడ్ డీల్ సానుకూలంగా ఉంటుందనే అంచనాల నేపథ్యంలో బంగారంపై ఒత్తిడిని తగ్గించాయని అబాన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అభిషేక్ బన్సాల్ అన్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. ఔన్స్ 0.7 శాతం తగ్గి 1,537.67 డాలర్ల వద్ద ఉంది. ఔన్స్ వెండి ధర 1 శాతం తగ్గి 17.79 డాలర్ల వద్ద, ప్లాటినం 0.6 శాతం తగ్గి 967.78 డాలర్ల వద్ద ఉంది.

హైదరాబాదులో ధర ఎంతంటే
కాగా, బంగారం ధర గత ఐదు రోజులుగా తగ్గుముఖం పడుతోంది. సోమవారం ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.236 తగ్గి రూ.40,432కు చేరుకుంది. వెండి కిలో రూ.47,635కు చేరుకుంది. హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.200 తగ్గి రూ.38,010కి చేరుకుంది. సోమవారం ఇది రూ.38,210గా ఉంది. హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.41,460 వద్ద ఉంది.

బంగారం సేల్స్ 30 శాతం పడిపోయాయి
2019లో బంగారం ధర ఇరవై శాతానికి పైగా పెరిగింది. దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా బంగారం ధర పెరిగింది. దీంతో సేల్స్ కూడా పడిపోయాయి. గత ఆరు నెలల్లో బంగారం సేల్స్ 30 శాతం పడిపోయాయని ఆల్ ఇండియా జమ్స్ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సెల్ చైర్మన్ అనంత పద్మనాభన్ వెల్లడించారు.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు కాస్త శాంతించాయి.. లక్షా యాభై వేల రూపాయల దిగువకు.. మార్చి 21, శనివారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఢమాల్.. గ్యాస్ ధరలు హడల్.. గ్లోబల్ మార్కెట్లో అసలేమి జరుగుతోంది..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు, కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications