సంక్రాంతి పండుగ తర్వాత పెళ్లిళ్ళు ఉంటాయి. వారికి ఇది శుభవార్తే! ఇటీవల ఇరాన్-అమెరికాల మధ్య ఉద్రిక్తతల కారణంగా బంగారం రూ.42,000 దాటి ఆల్ టైం హైకి చేరుకుంది. అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు సురక్షిత బంగారం వైపు చూశారు. అయితే ఇప్పుడు ఈ 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో బంగారం ధర దిగి వస్తోంది. మూడు రోజుల క్రితం ట్రంప్ ప్రకటన తర్వాత బంగారం రోజు రోజుకు తగ్గుతోంది. వరుసగా మూడో రోజు... శుక్రవారం (జనవరి 10) బంగారం ధర తగ్గింది. ఉద్రిక్తతలు పెరిగితే బంగారం ధరలు భారీగా పెరిగేవి. కానీ పరిస్థితి మారిపోయి కాస్త తగ్గుతున్నాయి. ఇది కొనుగోలుదారులకు శుభవార్తే!

ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి ధర
ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.38 శాతం తగ్గి రూ.39,680కి చేరుకుంది. ఎంసీఎక్స్‌లో గత వారం రూ.41,293తో రికార్డ్ హైకి చేరుకుంది. వెండి ధర కూడా భారీగానే తగ్గింది. కిలో వెండి ఈ రోజు 0.34 శాతం తగ్గి రూ.46,419 వద్ద ఉంది. బంగారం ధర దాదాపు రూ.1,700 తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్లోను...
ఇక, అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బంగారం ధరలు భారీగానే పడిపోయాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల సమయంలో ఔన్స్ పసిడి 1,650 పైకి చేరుకుంది. కానీ తాజాగా 1,551 డాలర్లకు దిగి వచ్చింది. వెండి ఔన్స్ ధర 17.89గా నిలకడగా ఉంది.

హైదరాబాద్ మార్కెట్లో గురువారం..
బంగారం ధరలు గురువారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో రూ.41 వేలకు దిగి వచ్చాయి. 10 గ్రాముల 99.9 స్వచ్ఛత బంగారం ధర హైదరాబాదులో రూ.41,100కు చేరుకుంది. వెండి రూ.47,600కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 1,550 డాలర్లకు దిగి రావడమే కారణం. రెండు రోజుల క్రితం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.42,000, వెండి కిలో రూ.49,200 పలికింది. ఆరేళ్ల తర్వాత పసిడి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్‌లలోకి నికర పెట్టుబడులు ప్రవహించాయి.

రూ.1000 వరకు తగ్గిన బంగారం ధర
శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ఏకంగా రూ.970 తగ్గి రూ.38,300కు దిగి వచ్చింది. గురువారం రూ.39,270 వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం రూ.వెయ్యి వరకు తగ్గింది.
More From GoodReturns

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, కారణం ఏంటంటే..

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications