భారీగా షాకిచ్చిన బంగారం, నేడు కాస్త ఊరట: వెండి పైపైకి.. రూ.65,000 సమీపానికి...

నిన్న భారీగా పెరిగిన పసిడి ధరలు, శుక్రవారం (నవంబర్ 6) స్వల్పంగా తగ్గాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో గురువారం 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1,257.00 (2.47%) పెరిగి రూ.52,077.00 వద్ద ముగిసింది. ఫిబ్రవరి ఫ్యూచర్స్ కూడా అదే స్థాయిలో పెరిగి రూ.52,200.00 వద్ద ముగిసింది. వెండి ఫ్యూచర్స్ అయితే దాదాపు రూ.3వేల వరకు పెరిగింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.2,736.00 (4.46%) పెరిగి రూ.64,125.00 వద్ద ముగియగా, మార్చి ఫ్యూచర్స్ రూ.2,952.00 (4.68%) పెరిగి రూ.66,000.00 వద్ద ముగిసింది. అయితే నేడు స్వల్పంగా తగ్గింది.

స్వల్పంగా తగ్గిన పసిడి ధర

స్వల్పంగా తగ్గిన పసిడి ధర

శుక్రవారం ఎంసీఎక్స్‌లో ఉదయం పది గంటల సమయానికి 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.164.00 (-0.32%) క్షీణించి రూ.51,891.00 వద్ద ట్రేడ్ అయింది. నిన్న రూ.52 మార్క్‌ను దాటిన పసిడి, ఈ రోజు కిందకు దిగింది. రూ.51,912.00 వద్ద ప్రారంభమై, రూ.51,929.00 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ.51,814.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.4,300కు పైగా తక్కువ ఉంది.

ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.183.00 (-0.35%) క్షీణించి రూ.52,011.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.52,066.00 ప్రారంభమైన ధర, రూ.52,066.00 వద్ద గరిష్టాన్ని, రూ.51,991.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి ధర పైపైకి..

వెండి ధర పైపైకి..

నిన్న డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.2700కు పైగా పెరిగగా, నేడు మరింత ఎగిసింది. కిలో వెండి రూ.275.00 (0.43%) పెరిగి రూ.64,528.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65వేల సమీపానికి చేరుకుంది. రూ.64,479.00 ప్రారంభం కాగా, రూ.64,594.00 గరిష్టాన్ని, రూ.64,313.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.322.00 (0.49%) పెరిగి రూ.66,277.00 పలికింది. రూ.66,135.00 ప్రారంభం కాగా, రూ.66,277.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,053.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

బంగారం తగ్గి, వెండి పెరిగి...

బంగారం తగ్గి, వెండి పెరిగి...

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్‌లో డిసెంబర్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 1945 డాలర్లు దాటింది. ఈ రోజు స్వల్పంగా తగ్గింది. 0.45% క్షీణించి ఔన్స్ పసిడి ఫ్యూచర్ 1,938.10 డాలర్లు పలికింది. క్రితం సెషన్‌లో 1,946.80 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. ఏడాదిలో పసిడి 27.33 శాతం పెరిగింది. నేడు 1,937.25 - 1,951.10 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది.

బంగారం నేడు తగ్గగా, సిల్వర్ ఫ్యూచర్స్ పెరిగింది. ఔన్స్ వెండి 0.36 శాతం పెరిగి 25.282 డాలర్లకు చేరుకుంది. వెండి ఏడాదిలో దాదాపు 40 శాతం పెరిగింది. క్రితం సెషన్లో 25.191 డాలర్ల వద్ద ముగిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+