బంగారం కొనుగోలుపై బులియన్ వ్యాపారులు కీలక అప్‌డేట్.. వచ్చే మూడు నెలలు చాలా అలర్ట్‌గా ఉండాలని సూచన

భారతదేశంలో వివాహాల సీజన్ ప్రారంభమవడంతో బంగారం డిమాండ్ మరోసారి పెరుగుతోంది. దీపావళి తర్వాత కొన్ని రోజులు మార్కెట్లో స్వల్ప మందగమనం కనిపించినప్పటికీ.. ప్రస్తుతం ఆభరణాల దుకాణాల్లో కొనుగోళ్లు మళ్లీ వేగం పెంచాయి. ఈ నేపథ్యంలో రాబోయే నెలల్లో బంగారం ధరలు మరింత పెరుగుతాయని.. ముఖ్యంగా 2025 చివరి త్రైమాసికం నుంచి 2026 ప్రారంభం వరకు ధరలు గణనీయంగా ఎగబాకే అవకాశముందని బులియన్ నిపుణులు సూచిస్తున్నారు.

లక్ష్మీ డైమండ్‌స్ చైర్మన్ & ఎండీ చేతన్ మెహతా మాట్లాడుతూ.. ఈ సంవత్సరం చాలామంది వినియోగదారులు పెట్టుబడి కోసం బంగారం కొనుగోళ్లు ఎక్కువగా చేసినట్లు తెలిపారు. ఆభరణాల కొనుగోళ్లు కొంత తగ్గినా.. వివాహాల వేళ దగ్గరపడుతున్నందున రిటైల్ డిమాండ్ వేగంగా పెరుగుతోందన్నారు. దీపావళి సమయంలో బలమైన అమ్మకాలు నమోదయ్యాయి. పండుగ తర్వాత 10 నుంచి 15 రోజుల విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ వినియోగదారులు పెద్ద సంఖ్యలో దుకాణాలకు వస్తున్నారని తెలిపారు.

gold price forecast gold price increase gold price prediction gold rally 2025 gold market outlook gold experts prediction gold price rise in 3 months bullion market news gold investment trends global gold prices gold rate update gold price boom gold forecast next 90 days precious metals news

దీపావళి నాడు సుమారు 50 శాతం మంది వినియోగదారులు పాత బంగారాన్ని మార్చుకొని కొత్త ఆభరణాలు కొనుగోలు చేశారు. రాబోయే నెలల్లో ఈ శాతం 20 నుంచి 25 శాతం వద్ద కొనసాగవచ్చని మెహతా అంచనా వేశారు. అలాగే ఈ సంవత్సరం వినియోగదారులు భారీ, ఆధునిక డిజైన్ల ఆభరణాల వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. పండుగల ముందు బంగారం ఇప్పటికే 10 నుంచి 15 శాతం పెరిగింది. ఇక రాబోయే మూడు నెలల్లో Gold ధరలు మరో 10నుంచి 20 శాతం పెరిగే అవకాశం ఉందని మెహతా తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

మార్కెట్ పరిస్థితులు అలాగే కొనసాగితే 10 గ్రాముల బంగారం రూ. 12 వేల నుండి రూ. 24 వేల వరకు అదనంగా పెరగవచ్చని ఆయన అంచనా. బంగారంతో పాటు వజ్రాల ఆభరణాలకు కూడా డిమాండ్ బలంగా ఉందని చెప్పారు. ముఖ్యంగా చిన్న, మధ్యస్థ బరువు గల వజ్రాల అమ్మకాలు పెరుగుతున్నాయని వెల్లడించారు.

ఇక అంతర్జాతీయ పరంగా చూస్తే.. బంగారం ధరల్లో ఉన్న అస్థిరత మధ్య కూడా దీర్ఘకాలికంగా బంగారం బలంగా ఉండే అవకాశం ఉందని కామా జ్యువెలరీ ఎండీ కాలిన్ షా అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అనిశ్చితి, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు బంగారాన్ని సురక్షిత ఆస్తిగా నిలుపుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం గోల్డ్ ఔన్సు ధర 4,041 డాలర్ల వద్ద ఉంది. షా అంచనాల ప్రకారం.. రాబోయే 12 నుంచి 15 నెలల్లో బంగారం ఔన్సుకు 5 వేల డాలర్లకు చేరే అవకాశం ఉంది. ఈ పరిస్థితి నిజమైతే భారత మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1.25 లక్షల నుంచి రూ. 1.50 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది.

అధిక ధరల ప్రభావంతో ఈ సంవత్సరం ఆభరణాల అమ్మకాలు గ్రాముల పరంగా తగ్గినా.. అమ్మకాల విలువ మాత్రం స్థిరంగానే ఉందని షా తెలిపారు. ఇంకా చాలా మంది వినియోగదారులు ETFలు, డిజిటల్ గోల్డ్, బంగారం కడ్డీలు, నాణేల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని చెప్పారు. షా అంచనా ప్రకారం ఈ సంవత్సరం ఆభరణాల అమ్మకాల పరిమాణం 10 నుంచి 15 శాతం తగ్గినట్లు కనిపిస్తోంది. భవిష్యత్తులో దిగుమతుల్లో పెద్ద మార్పు లేకపోయినా, బులియన్ రూపంలో పెట్టుబడుల కోసం దిగుమతి అయ్యే బంగారం తక్కువకాలంలో పెరుగుతోందని చెప్పారు. ధరలు ఎక్కువ ఉన్నప్పటికీ వివాహాల సీజన్ డిసెంబర్ నుంచి మార్చి వరకు Gold కొనుగోళ్లు ఎక్కువగా జరగడం ఖాయం అని నిపుణులు భావిస్తున్నారు.

అంతర్జాతీయంగా కూడా ఆభరణాల ఎగుమతులు మెరుగ్గా ఉన్నాయి. అమెరికా మార్కెట్ ఊహించిన దానికంటే మెరుగైన స్పందన ఇస్తున్నదని, ఈ సంవత్సరం క్రిస్మస్ సీజన్ అమ్మకాలు కూడా గత సంవత్సరం స్థాయిలోనే ఉన్నట్లు కనిపిస్తున్నాయని షా తెలిపారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+