Gold Rates in Telugu States: బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..పెట్టుబడిదారులు మళ్లీ బంగారం సురక్షితమైనదిగా భావిస్తున్నారు. దీంతో పసిడిలో పెట్టుబడులు ఎక్కువగా పెట్టడంతో దాని ధరలు మళ్లీ నింగిని తాకేందుకు రెడీ అవుతున్నాయి. జూలై మొదటి రెండు రోజుల్లోనే బంగారం ధరల్లో భారీ పెరుగుదల చోటు చేసుకుంది. 24 క్యారెట్ బంగారం ధర రూ.16,300 వరకు పెరిగి.. రూ.1 లక్ష మార్క్ ను దాటేందుకు అడుగుదూరంలో ఉంది. అమెరికా డాలర్ బలహీనపడుతున్న డాలర్, అంతర్జాతీయ మార్కెట్లలో మళ్లీ నెలకొన్న అస్థిరత..అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ దూకుడు, అలాగే వాణిజ్య రంగంలో నెలకొన్న అస్థిరత వంటి అంశాలు ఈ సారి బంగారాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
నేటి బంగారం ధరల (జూలై 2)ను గమనించినట్లైతే.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములకు రూ. 98,890కు చేరుకుంది. రెండు రోజుల్లో రూ.1,630 పెరిగింది. రేపో మాపో లక్షకు చేరుకునే అవకాశం ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 90,650కు చేరుకుంది. దాదాపు 450 పెంపు రెండు రోజుల్లో కనిపించింది. ఇక 18 క్యారెట్ బంగారం ధర విషయానికి వస్తే.. 10 గ్రాములు 74,170కు చేరుకుంది. రెండు రోజుల్లో 370 పెరిగింది. దీన్ని 100 గ్రాముల ప్రాతిపదికన చూస్తే, 24 క్యారెట్ బంగారం ధర రెండు రోజుల్లో రూ. 16,300 పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే హైదరాబాద్, విజయవాడ వైజాగ్ నగరంలో బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,890 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.90,650 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.73,170 గా నమోదైంది.
విజయవాడలో10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,890 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.90,650 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.73,170 గా నమోదైంది.విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,890 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.90,650 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.73,170 గా నమోదైంది.
గత వారం బంగారం తగ్గిన నేపథ్యంలో కొనుగోలు చేసినవారు లాభాల బాటలో నడిచారు. ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత కొన్ని రోజులు వరకు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే మళ్లీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు పసిడి ధరపై ప్రభావం చూపుతున్నాయి. బంగారం వైపు పెట్టుబడుదారులు పరుగులు పెడుతున్నారు. దీంతో బంగారానికి మళ్లీ రెక్కలు వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మళ్లీ అస్థిరత మొదలవడంతో బంగారం ధరలు ఒక్కసారిగా జంప్ అయ్యాయి.
నిర్మల్ బాంగ్ బ్రోకరేజ్ సంస్థ తాజా రిపోర్ట్ ప్రకారం, బంగారం ధరలు త్వరలో స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు పెరగడంతో ముంబయి, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ధరలు కలిపి రూ. 9,889 నుంచి రూ. 9,904 (24K) మధ్య నమోదయ్యాయి. గత వారం పడిపోయిన పసిడి ఇప్పుడు మళ్లీ పెట్టుబడిదారులకు లాభాలను తెచ్చిపెడుతోంది. ధరలు ఇప్పటికే గరిష్ట స్థాయికి ఇప్పటికే చేరిన నేపథ్యంలో పెట్టుబడిదారులు లాభాల కోసమే ఇందులో పెట్టుబడులు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం మరింత పెరుగుదలకు అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో రిస్క్ కూడా ఉండే అవకాశం ఉందంటున్నారు.
ఇక వెండి ధర కూడా అదే ధోరణిలో ఉంది. నేడు వెండి ధర రూ. 110/గ్రాం కాగా, కిలో వెండి ధర రూ.1,10,000కు చేరింది. ఇది కొన్ని వారాల్లోనే అత్యధిక స్థాయికి చేరుకుందని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

Bullet train: మరో 16 హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల తయారీకి గ్రీన్ సిగ్నల్! సౌత్ ఇండియాలో రాబోయే రూట్లు ఇవే..

Hyderabad:హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్: మారుతున్న నగరం ముఖచిత్రం.. కొత్త ఫ్లైఓవర్లు ఇవే!

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

Hyderabad: షాపింగ్, వెల్నెస్, గ్యాస్ట్రోనమీ.. హైదరాబాద్ బ్రాండింగ్ మార్చబోతున్న మూడు కీలక స్తంభాలు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications