రూ.11 వేలు పెరిగిన బంగారం ధర..సెప్టెంబర్ నెలలో మరో షాక్ తప్పదంటున్న బ్యాకింగ్ రంగ నిపుణులు
భారతదేశంలో బంగారం ధరలు నాలుగు రోజుల నుంచి వరుసగా పెరుగుతున్నాయి. ఈ పెరుగుదల వెనుక ప్రధాన కారణాలను చూస్తే.. పండుగ సీజన్ డిమాండ్, అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితిని ప్రధానం చెప్పుకోవచ్చు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారతీయ వస్తువులపై 50 శాతం సుంకం విధించారు. ఇది ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రభావం వాణిజ్య సంబంధాలపై పడింది. దీంతో పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తులవైపు మొగ్గుచూపుతున్నారు. అందులో బంగారం ప్రముఖ సురక్షిత సాధనంగా నిలుస్తోంది.
ఆగస్టు 26 నుంచి 29 వరకు.. కేవలం మూడు రోజుల్లోనే 100 గ్రాముల Gold ధర రూ.11 వేలు పెరిగింది. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,100 పెరిగింది.
ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల 24కే బంగారం ధర రూ.1,01,506 వద్ద ట్రేడవుతోంది.సాధారణంగా భారతదేశంలో పండుగ సమయాల్లో బంగారం డిమాండ్ ఎప్పుడూ చాలా ఎక్కువగానే ఉంటుంది. దసరా, దీపావళి వంటి పండుగలకు ముందు జ్యువెలరీ షాపులు తమ స్టాక్‌ను తిరిగి నింపుకుంటాయి. అయితే అధిక ధరల కారణంగా రిటైల్ కొనుగోలు కొంత తగ్గింది.

ఇండియా బులియన్ & జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వైస్ ప్రెసిడెంట్ అక్ష కాంబోజ్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం రిటైల్ డిమాండ్ సాధారణ స్థాయిలతో పోలిస్తే 60 శాతం వరకు తగ్గింది. అయినప్పటికీ పెట్టుబడి కోణంలో Gold మీద ఆసక్తి పెరుగుతోందన్నారు. కాంబోజ్ ప్రకారం, బంగారం ఇప్పటికీ ఒక సురక్షిత పెట్టుబడి ఆస్తిగా ఉంది. ప్రపంచంలో వాణిజ్య అనిశ్చితి పెరుగుతున్న సందర్భంలో, చాలా మంది పెట్టుబడిదారులు తమ సంపదను రక్షించుకోవడానికి బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు. ఆభరణాల కొనుగోలు తగ్గినా, బంగారం ETFs (Exchange Traded Funds) లేదా భౌతిక బంగారం రూపంలో పెట్టుబడులకు డిమాండ్ పెరిగింది.
ఇక బంగారంతో పాటు వెండి కూడా కొత్త పెట్టుబడి మార్గంగా ముందుకు వస్తోంది. గత కొన్నేళ్లలో వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం వెండి ధర కిలోకు రూ.1,17,110 వద్ద ఉంది. కొన్ని నగరాల్లో స్పాట్ మార్కెట్లో ధర కిలోకు రూ.1.20 లక్షలు వరకు చేరింది.పెట్టుబడిదారులు వెండిని ఒక వైపు ద్రవ్యోల్బణం నుంచి రక్షణగా, మరో వైపు పరిశ్రమల వృద్ధి అవకాశంగా చూస్తున్నారు. దీంతో దాని ధరలు పెరుగుతున్నాయి.
అధిక ధరల కారణంగా బంగారం మీద తక్షణ లాభాలు ఆశించడం కష్టం. కానీ దీర్ఘకాలంలో బంగారం మీ సంపదను కాపాడే సురక్షిత పెట్టుబడి అని నిపుణులు చెబుతున్నారు. పండుగల ముందు కొంత స్మార్ట్ బయ్యింగ్ చేయవచ్చు.ఇక వెండిని చూసినట్లయితే పరిశ్రమల డిమాండ్ బలంగా ఉండటంతో వెండికి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్నాయి. మధ్య-దీర్ఘకాలిక పెట్టుబడిగా వెండి పోర్ట్‌ఫోలియోలో భాగం కావచ్చని చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications