బంగారం కొనాలనుకునే వారికి ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. కానీ, ఇప్పటికే కొని పెట్టుకున్న వారికి పండగే. ఎందుకంటే 2026 సంవత్సరం పసిడి ప్రేమికులకు, ఇన్వెస్టర్లకు ఒక అద్భుతమైన సంవత్సరంగా మారుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం (Gold) ధరలు చుక్కలను తాకుతున్నాయి. తాజాగా మంగళవారం జరిగిన ట్రేడింగ్‌లో కామెక్స్ (Comex) గోల్డ్ ఫ్యూచర్స్ భారీగా పెరిగి, ఒక ఔన్సు బంగారం ధర $5,071.60 వద్ద ముగిసింది. కేవలం ఒక్క రోజులోనే సుమారు 1.35 శాతం పెరుగుదల కనిపించడం విశేషం.

అసలు బంగారం ఎందుకు పెరుగుతోంది?
ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక పరిస్థితులు , అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకుంటున్న నిర్ణయాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జనవరి నెలలో అమెరికాలో ఉద్యోగాల కల్పన అంచనాలను మించి నమోదైంది. సాధారణంగా ఉద్యోగాల మార్కెట్ బలంగా ఉంటే వడ్డీ రేట్లు తగ్గే అవకాశం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఆర్థిక అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం (Gold) వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే ధరలు తగ్గకుండా నిలకడగా పెరుగుతున్నాయి.
$5,000 మార్కు దాటడం వెనుక విశేషం
టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం.. బంగారం ధర $5,000 మార్కును దాటడం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టం. కేవలం మూడు వారాల క్రితమే ఈ స్థాయిని తాకిన బంగారం, ఇప్పుడు దానిని ఒక బలమైన సపోర్ట్ లెవల్ గా మార్చుకుంది. అంటే ఇకపై ధరలు దీనికంటే కిందకు పడిపోయే అవకాశం తక్కువ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 29న బంగారం తన ఆల్ టైమ్ హై రికార్డు అయిన $5,318.40 ని తాకింది. ప్రస్తుత ధర దానికంటే కొంచెం తక్కువగా ఉన్నా, ఏడాది ప్రారంభం ధరతో పోలిస్తే మాత్రం భారీ లాభాల్లో ఉంది.
ఈ ఏడాది లాభాల పంట
2026 సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటివరకు బంగారం సుమారు $746 పెరిగింది. అంటే కేవలం ఒకటిన్నర నెలలోనే ఇన్వెస్టర్లకు 17.25 శాతం లాభం చేకూరింది. ఫిబ్రవరి నెల సగం కూడా పూర్తికాకముందే ఇప్పటికే $188 లాభాన్ని అందించింది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ (Fed) వడ్డీ రేట్ల తగ్గింపుపై ఇంకా స్పష్టత ఇవ్వకపోయినా జూలై లేదా డిసెంబర్ నాటికి రేట్లు తగ్గుతాయన్న ఆశలతో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి.
ముఖ్యంగా ద్రవ్యోల్బణం (Inflation) భయాలు, కరెన్సీ విలువ తగ్గడం వంటి కారణాల వల్ల ప్రజలు బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా వచ్చే ద్రవ్యోల్బణ గణాంకాలు బంగారం ధర తదుపరి దిశను నిర్ణయించనున్నాయి. ఒకవేళ ధరలు తగ్గినా $4,800 వద్ద మంచి మద్దతు లభిస్తుందని, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఇది గోల్డెన్ టైమ్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications