బంగారం ధర రికార్డులను బద్దలు కొట్టి ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసింది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో 10 గ్రాములకు రూ. 1.10 లక్షలుగా నమోదైంది. అమెరికా డాలర్ బలహీనత మధ్య Gold కొత్త శిఖరాలకు చేరుకుంది. MCXలో బంగారం ధరలు అన్ని రికార్డులను బద్దలు కొట్టి ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. స్పాట్ మార్కెట్లో బలమైన డిమాండ్, US డాలర్ బలహీనపడటం, US ఫెడ్ వచ్చే వారం వడ్డీ రేట్లను తగ్గిస్తుందని అంచనాలు ఈ పెరుగుదలకు కారణమయ్యాయి.
రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ జిగర్ త్రివేది బంగారం ధరలు పెరుగుదలపై మాట్లాడుతూ.. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేటును తగ్గిస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయని దీని కారణంగా బంగారం రికార్డులు సృష్టిస్తోందని అన్నారు.కాగా గత వారం USలో ఉద్యోగాల తగ్గింపు నివేదిక విడుదలైంది. దీని కారణంగా మార్కెట్ వడ్డీ రేట్లలో కోత ఉంటుందని అంచనా వేసింది. ఈ సంవత్సరం చివరి నాటికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత తగ్గిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

కేడియా కమోడిటీస్ అధ్యక్షుడు అజయ్ కేడియా ప్రకారం.. Gold, వెండి ధరలు పెరుగుదల ఆగడం లేదు. ఫెడ్ అంచనా ప్రకారం రేటు తగ్గింపు, డాలర్ బలహీనత, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తత, US ఉద్యోగ డేటా, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, పండుగ సీజన్. ETF లోపల కొనుగోళ్లు ఇలా అన్నీ అంశాలు ఒక్కసారిగా బంగారం పెరుగుదలకు కారణమవుతున్నాయన్నారు. ఇంతకుముందు దేశీయ మార్కెట్లో రూ. 1.10 లక్షల స్థాయిని అంచనా వేసాం.
అయితే బంగారం దీనిని పూర్తిగా దాటిపోయింది. దీంతో కొత్త కొనుగోళ్లకు అవకాశం లేకుండా పోయిందన్నారు. బంగారం స్థాయి 1.10 లక్షలు, వెండి 1.30 లక్షలుగా కనిపిస్తోందన్నారు. గత ఒక సంవత్సరంలో బంగారం, వెండి దాదాపు 50 శాతం పెరిగాయి. అటువంటి పరిస్థితిలో, బంగారం దాదాపు 1 లక్షకు, వెండిని దాదాపు 1.05 లక్షలకు చేరినప్పుడే కొనుగోలు చేయాలని కేడియా చెబుతున్నారు.
ఫెడ్ అధికారుల సంకేతాలతో పాటు, అమెరికా ఆర్థిక డేటా కూడా ఈ సెప్టెంబర్‌లో రేటు కోతల అంచనాలను బలోపేతం చేసింది. ఇప్పుడు అందరి దృష్టి గురువారం వచ్చే US ద్రవ్యోల్బణ రేటు (CPI) డేటాపై ఉంది. ఇది ఫెడ్ ద్రవ్య విధానం దిశను నిర్ణయించడంలో కీలకంగా మారనుంది. పృథ్వీ ఫిన్‌మార్ట్ మనోజ్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. బంగారం రూ. 1,08,000 నుండి 1,07,440 మధ్యకు వచ్చినప్పుడే కొనుగోలు చేయాలని సూచించారు. రూ. 1,09,100-1,09,650 మధ్య పసిడి కొనుగోలు బంద్ చేయాలని తెలిపారు.
ఆస్పెక్ట్ బులియన్ & రిఫైనరీ CEO దర్శన్ దేశాయ్ మాట్లాడుతూ.. ఈ ర్యాలీ ఎంతకాలం కొనసాగుతుందనేది ఈరోజు వచ్చే సవరించిన US ఉద్యోగ డేటా, ఈ వారం వచ్చే ద్రవ్యోల్బణ రేటు డేటాపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ETFలలో పెట్టుబడి, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, ఫెడ్‌పై రాజకీయ ఒత్తిడి భయాలు బంగారం ధరలను ఎక్కువగా ఉంచవచ్చని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. సాధారణంగా బంగారం, వెండి ధరలు ప్రధానంగా US డాలర్‌లో హెచ్చుతగ్గుల ద్వారా నిర్ణయిస్తారు. డాలర్ విలువ తగ్గడం రూపాయిని బలపరుస్తుంది.
అలాగే డాలర్ విలువ బలపడటం రూపాయిని బలహీనపరుస్తుంది. డాలర్ ధర పెరిగి రూపాయి బలహీనపడినప్పుడు, భారతదేశంలో బంగారం ధర కూడా పెరుగుతుంది. దీని కారణంగా భారతదేశం పెద్ద ఎత్తున బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. దీంతో GST, కస్టమ్స్ సుంకం వంటి అనేక రకాల పన్నులు బంగారంపై విధించబడతాయి, ఇది బంగారం ధరలలో వేగవంతమైన పెరుగుదలకు కూడా కారణమవుతుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

ఈ ఏడాది బంగారం, వెండి పెరుగుదలపై సంచలన నివేదిక.. ఏకంగా ఆ స్థాయి వరకు వెళుతుందంటున్న నిపుణులు..

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

బంగారం, వెండి ధరలు తగ్గాయి. తాజా రేట్లు ఇక్కడ చూడండి

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!



Click it and Unblock the Notifications