ఈ ఏడాది పెట్టుబడిదారులకు బంగారం అద్భుతమైన రాబడిని అందించింది. MCXలో ఈ విలువైన పసుపు లోహం దాదాపు 30 శాతానికి పైగా పెరిగింది. గత 6 ఏళ్లలో MCX బంగారం ధర 10 గ్రాములకు రూ. 32,000 (మే 2019) నుండి రూ. లక్షకు పైగానే(2025)కి చేరింది. అంటే దాదాపు 200 శాతం పెరిగింది. నిపుణుల అంచనా ప్రకారం, రాబోయే 5 ఏళ్లలో కనీసం 40 శాతం పెరుగుదల ఉండవచ్చని, అయితే బుల్ మార్కెట్ కొనసాగితే 125 శాతం వరకు ఖరీదవుతుందని చెబుతున్నారు.
స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ కు చెందిన సంతోష్ మీనా ప్రకారం.. భారతీయ కుటుంబాల్లో బంగారం అనేది శతాబ్దాలుగా భావోద్వేగ, ఆర్థిక విలువ కలిగి ఉంది. ఇటీవలి కాలంలో ఇది ప్రపంచ కేంద్ర బ్యాంకులకు కూడా వ్యూహాత్మక ఆస్తిగా మారింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్‌పై తగ్గుతున్న విశ్వాసం, అమెరికా పెరుగుతున్న రుణం వంటి అంశాలు బంగారం డిమాండ్‌ను పెంచాయి. గత 5 ఏళ్లలో బంగారం 18 శాతం CAGR ఇచ్చింది. ఇదే ట్రెండ్ కొనసాగితే 2030 నాటికి 10 గ్రాములకు రూ. 2,25,000 చేరుకోవచ్చని తెలిపారు.పెట్టుబడిదారులు బంగారం మాత్రమే అధిక లాభాలు ఇస్తుందని భావిస్తున్నారు. కష్ట కాలంలో బంగారంను మించిన పెట్టుబడి ఇంకొకటి లేదని చెబుతున్నారు.

SS వెల్త్‌స్ట్రీట్‌కు చెందిన సుగంధ సచ్‌దేవా ప్రకారం.. COVID మహమ్మారి, వడ్డీ రేట్ల తగ్గింపు, కరెన్సీ క్షీణత, డీ-డాలరైజేషన్ ప్రయత్నాలు, అమెరికా-చైనా సుంకాల యుద్ధం వంటి అంశాలన్నీ కలుపుకుని బంగారం ధరలను రూ. 1,01,000 దాటేలా చేశాయని చెప్పుకొచ్చారు. వారి అంచనా ప్రకారం, రాబోయే 5 ఏళ్లలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,50,000- 1,70,000 మధ్య ఉండవచ్చు. సపోర్ట్ లెవెల్ రూ. 80,000-90,000 వద్ద ఉండొచ్చని తెలిపారు.దీర్ఘకాలికంగా బంగారం పెరుగుదలకు అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు.
బంగారం నిపుణులు చెబుతున్న విషయం ఏమిటంటే Gold దీర్ఘకాలిక విలువ నిల్వగా..సురక్షితమైన ఆస్తిగా ఉన్నందున.. పెట్టుబడిదారులు దాన్ని నిర్లక్ష్యం చేయరాదంటున్నారు. ధరల దిద్దుబాటు సమయంలో క్రమపద్ధతిగా కొనుగోలు చేస్తే, రిస్క్-సర్దుబాటు అయి రాబడులు మెరుగవుతాయని చెబుతున్నారు.
ఏది ఏమైనా.. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, డాలర్ బలహీనత.. ఈ మూడు అంశాలు కలసి బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. అయితే, యుద్ధ చర్చలు, ఫెడ్ పాలసీ నిర్ణయాలు, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల పురోగతి..ఈ అంశాలన్నీ రాబోయే వారాల్లో Gold గమనాన్ని నిర్ణయించనున్నాయి.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

Gold price Today: భగభగమంటున్న పసిడి.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే?

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications