అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ ఇండెక్స్ మూడు నెలల గరిష్ట స్థాయికి చేరుకోవడంతో బంగారం, వెండి ధరలు మరోసారి ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మంగళవారం ఉదయం MCXలో బంగారం ధరలు రూ.666 లేదా 0.55% తగ్గి రూ.1,20,743/10 గ్రాముల వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. గత వారం రోజులుగా ధరలు రూ.1.21 లక్షల వద్ద నిరోధ స్థాయిని ఎదుర్కొంటున్నాయి.
ఇక వెండి ధరలు కూడా పెద్ద ఎత్తున పడిపోయాయి. MCXలో డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.1,323 లేదా 0.9% తగ్గి రూ.1,46,435/కిలో వద్ద ట్రేడవుతున్నాయి. ప్రపంచ మార్కెట్లలో కూడా ఇదే ధోరణి కొనసాగింది. 0047 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.4 శాతం తగ్గి 3,983.87 డాలర్లకి చేరుకోగా, US డిసెంబర్ ఫ్యూచర్స్ ఔన్సుకు 0.5% తగ్గి 3,994.10 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి.డాలర్ ఇండెక్స్ బలపడటంతో US వడ్డీ రేటు తగ్గింపు అవకాశాలు తగ్గిపోయాయి. US-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు సడలడం వల్ల సేఫ్ హేవెన్ డిమాండ్ తగ్గి బులియన్ మార్కెట్ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. సోమవారం Gold, వెండి మిశ్రమ లాభాలతో ముగిసినా, తాజా సెషన్‌లో మళ్లీ ఒత్తిడి ప్రారంభమైంది.

పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్ నిపుణుడు మనోజ్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. ప్రపంచ మార్కెట్లలో ఉన్న అనిశ్చితి, జియోపాలిటికల్ టెన్షన్స్, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు బంగారం, వెండికి మధ్యకాల మద్దతును ఇస్తున్నాయి. అయితే, తక్షణంలో డాలర్ బలపడటం వల్ల ధరలు మరింత అస్థిరతను చూపే అవకాశం ఉందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో Gold 3,870 డాలర్ల వద్ద మద్దతు పొందుతుందని, 4,140 డాలర్ల వద్ద నిరోధం ఉందని ఆయన అంచనా వేశారు. వెండి కోసం 46.50 డాలర్ల నుంచి 50.50 డాలర్ల ఔన్సు పరిధిలో ట్రేడింగ్ కొనసాగుతుందని తెలిపారు.
MCXలో కూడా బంగారం ధరకు మద్దతు (కొనుగోలు స్థాయి) రూ.1,20,800 నుంచి 1,20,120 వద్ద ఉండగా, నిరోధ స్థాయి (కొనుగోలు ఆపే స్థాయి) రూ.1,22,000 నుంచి రూ. 1,22,750 వద్ద ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రూ.1,22,000 లక్ష్యానికి రూ.1,19,900 స్టాప్ లాస్‌తో రూ.1,20,650 వద్ద బంగారాన్ని కొనుగోలు చేయవచ్చని వారు సూచిస్తున్నారు. వెండి ధరకు మద్దతు రూ.1,46,600-1,45,800 వద్ద ఉండగా, నిరోధం రూ.1,48,800-1,49,500 వద్ద ఉందని అంచనా వేశారు. అంటే Gold రూ. లక్షా 19 వేల మధ్యకు వచ్చినప్పుడు కొనుగోలు చేస్తే సామాన్యులు లాభపడే అవకాశం ఉంది. అదే రూ. లక్షా 22 వేలు దాటితే కొనుగోలు ఆపడం ఉత్తమమని చెబుతున్నారు. లేకుంటే నష్టాల బాట తప్పదని చెబుతున్నారు.
డాలర్ ఇండెక్స్ (DXY) ప్రస్తుతం 99.97 వద్ద 0.10% పెరిగి ఉంది. US వ్యవసాయేతర ఉపాధి డేటా, ఫెడరల్ రిజర్వ్ పాలసీ అప్‌డేట్స్, యూరో బలహీనత వంటి అంశాలు ఈ వారం బంగారం, వెండి మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి.
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు కూడా స్వల్ప మార్పులతో కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,688/8 గ్రాములు, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ.98,592/8 గ్రాములు. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.91,248, 24 క్యారెట్ల బంగారం రూ.98,168 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్లు రూ.90,528, 24 క్యారెట్లు రూ.97,296 కాగా, హైదరాబాద్‌లో వరుసగా రూ.90,744 మరియు రూ.97,560 వద్ద ఉన్నాయి. బంగారం, వెండి ధరలు సమీప భవిష్యత్తులో డాలర్ ఇండెక్స్, గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్స్‌పై ఆధారపడి మారే అవకాశం ఉంది. నిపుణుల ప్రకారం, ప్రస్తుతం ఉన్న డిప్స్‌లో బంగారం కొంతకాల పెట్టుబడిదారులకు ఆకర్షణీయ అవకాశంగా నిలుస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

బంగారం ధరలు పెరిగాయి .. ఎంత పెరిగాయో తెలిస్తే పసిడి జోలికి పోరు.. మార్చి 11, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం, వెండి ధరలు: MCXలో లాభాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంపై కీలక విషయాలు వెల్లడి!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారం, వెండి ధరలు: ఇరాన్ వార్ కారణంగా భారత్‌లో భారీగా పెరిగిన ధరలు - కారణాలు, ప్రభావాలు

బంగారం ధర పెరిగింది .. కొనుగోలు వెంటనే బంద్ చేయండి.. మార్చి 10, మంగళవారం ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు ఢమాల్..ఈ రోజు ఎంత తగ్గిందో తెలిస్తే పండగ చేసుకుంటారు .. మార్చి 4,బుధవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications