బంగారం ధరలు పెరుగుతున్నాయనే ఆందోళన అవసరం లేదంటున్న నిపుణులు.. వారు చెప్పే గుడ్ న్యూస్ ఏంటంటే..
బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈరోజు MCX మార్కెట్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు రూ.1,09,163/10 గ్రాముల వద్ద స్థిరపడినట్లు తెలుస్తోంది. అయితే, ఈ వారం చివర్లో జరగనున్న FOMC (ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ) సమావేశానికి ముందుగా కొంత లాభాల స్వీకరణతో బంగారం ధరలు రూ.207 (0.19%) పడిపోయాయి. అదే సమయంలో, డిసెంబర్ వెండి ఫ్యూచర్స్ ధరలు కూడా ఫ్లాట్‌గా రూ.1,28,765/కిలో వద్ద ట్రేడవుతున్నాయి.
గత వారంలో గ్లోబల్ మార్కెట్లు ఆశాజనకంగా స్థిరపడిన సందర్భంలో.. Gold ధరలు ట్రాయ్ ఔన్సుకు 3,700 డాలర్లను అధిగమించి చారిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వెండి కూడా గత 14 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది. ఇది ప్రధానంగా పెట్టుబడిదారులకు సేఫ్ హెవన్ గా భావించడం.. అలాగే ఫెడరల్ రేటు కోత అంచనాలతో జరిగింది.

పృథ్వీ ఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్ నిపుణుడు మనోజ్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం అమెరికా వాణిజ్య సుంకాలు పెరగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, FOMC సమావేశం త్వరలో జరగనుండటం వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు అస్థిరంగా మారే అవకాశం ఉంది. ఆయన అంచనా ప్రకారం, బంగారం ట్రాయ్ ఔన్సుకు 3,534 డాలర్ల నుంచి 3,800 డాలర్ల పరిధిలో ఉండగా, వెండి 41.40 డాలర్ల నుంచి 44.50 డాలర్ల పరిధిలో ట్రేడవుతుందని చెప్పారు.
Gold ధరకు మద్దతు అంటే కొనుగోలు చేస్ స్థాయి రూ.1,09,000 నుండి 1,08,440 వరకు ఉంటాయి. అలాగే రూ.1,09,850-1,10,200 వద్ద కొనుగోలు ఆపడం ఉంది. వెండికి మద్దతు రూ.1,27,700-1,26,650 మధ్యగా ఉంటే, నిరోధ స్థాయి రూ.1,29,500-1,30,300 వరకు ఉండటంతో.. ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయాలని నిపుణులు సూచించారు.
దేశీయ మార్కెట్ల విషయానికి వస్తే, ఈరోజు ఢిల్లీలో 22 క్యారెట్లు స్టాండర్డ్ బంగారం ధర రూ.58,384/8 గ్రాములు కాగా స్వచ్ఛమైన (24 క్యారెట్లు) బంగారం ధర రూ.62,208/8 గ్రాములు ఉంది. ముంబైలో 22 క్యారెట్లు రూ.57,256/8 గ్రాములు కాగా 24 క్యారెట్లు రూ.60,992/8 గ్రాములుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్లు రూ.56,688/8 గ్రాములు, 24 క్యారెట్లు రూ.60,440/8 గ్రాములు వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్లు రూ.57,192/8 గ్రాములు, 24 క్యారెట్లు రూ.60,920/8 గ్రాములు వద్ద ట్రేడ్ అవుతోంది. క్లుప్తంగా చెప్పాలంటే భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు FOMC నిర్ణయాలపై ఆధారపడి మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడిదారులు జాగ్రత్తగా మార్కెట్ పరిస్థితులను గమనించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications