Gold Price Today: దాదాపుగా పదిరోజుల తర్వాత బంగారం తిరిగి పెరుగుదల వైపు పయనిస్తోంది. దీనికి ముందు నాలుగు రోజులు గోల్డ్ రేట్లు దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగాయి. పైగా ప్రస్తుతం బంగారం ధరలు 5 నెలల కనిష్ఠాల వద్ద ఉన్నాయి. శ్రావణమాసం ప్రారంభంతో శుభకార్యాల వల్ల మళ్లీ ధరలు పెరుగుతున్నాయి.
22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.50 మేర పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.54,550, ముంబైలో రూ.54,150, దిల్లీలో రూ.54,300, కలకత్తాలో రూ.54,150, బెంగళూరులో రూ.54,150, కేరళలో రూ.54,150, వడోదరలో రూ.54,200, జైపూర్ లో రూ.54,300, కోయంబత్తూరులో రూ.54,550, సూరత్ లో రూ.54,200, మంగళూరులో రూ.54,150, నాశిక్ లో రూ.54,180గా కొనసాగుతున్నాయి.

ఇదే సమయంలో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.50 మేర పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో విక్రయిస్తున్న రిటైల్ రేట్లను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.59,550, ముంబైలో రూ.59,070, దిల్లీలో రూ.59,220, కలకత్తాలో రూ.59,070, బెంగళూరులో రూ.59,070, కేరళలో రూ.59,070, వడోదరలో రూ.59,120, జైపూర్ లో రూ.59,220, కోయంబత్తూరులో రూ.59,500, సూరత్ లో రూ.59,120, మంగళూరులో రూ.59,070, నాశిక్ లో రూ.59,100 వద్ద ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, నెల్లూరు, అనంతపురం, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల పసిడి ధరలను పరిశీలిస్తే.. రూ.54,150 వద్ద కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో 24 క్యారెట్ల బంగారం రేటును పరిశీలిస్తే రూ.59,070గా కొనసాగుతోంది. తెలంగాణలోని ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజాంబాద్ లలో సైతం ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధరను పరిశీలిస్తే స్థిరంగా రూ.76,500 వద్ద విక్రయించబడుతోంది.


Click it and Unblock the Notifications