Gold Rate: గోల్డ్ రేటు షాక్.. వాలెంటైన్స్ డే గిఫ్ట్ వెంటనే కొనేయండి.. నేటి ధరలివే..
Gold Price Today: ఫిబ్రవరి నెలలో వాలెంటైన్స్ డేతో పాటు ఎక్కువ పెళ్లిళ్లు ఉండటం వల్ల బంగారం షాపింగ్ చేసేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో అధిక డిమాండ్ వల్ల రేట్లు దాదాపు 3 వారాల తర్వాత తిరిగి పుంజుకుంటున్నాయి. చాలా మంది తమ ప్రియమైన వారికి ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు.
ఈ క్రమంలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాముల ధర నిన్నటి కంటే రూ.250 మేర స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి రిటైల్ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.58,500, ముంబైలో రూ.58,000, దిల్లీలో రూ.58,150, కలకత్తాలో రూ.58,000, బెంగళూరులో రూ.58,000, వడోదరలో రూ.58,050, జైపూరులో రూ.58,150, లక్నోలో రూ.58,150, మధురైలో రూ.58,500, మంగళూరులో రూ.58,000, నాశిక్ లో రూ.58,030, మైసూరులో రూ.58,000, అయోధ్యలో రూ.58,150, బళ్లారిలో రూ.58,000, గురుగ్రాములో రూ.58,150 వద్ద నేడు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు నిన్నటి కంటే రూ.230 పెరుగుదలను నమోదు చేసింది. దేశంలోని వివిధ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.63,820, ముంబైలో రూ.63,230, దిల్లీలో రూ.63,330, కలకత్తాలో రూ.63,230, బెంగళూరులో రూ.63,230, వడోదరలో రూ.63,330, జైపూరులో రూ.63,330, లక్నోలో రూ.63,330, మధురైలో రూ.63,820, మంగళూరులో రూ.63,230, నాశిక్ లో రూ.63,260, మైసూరులో రూ.63,230, అయోధ్యలో రూ.63,330, బళ్లారిలో రూ.63,230, గురుగ్రాములో రూ.63,330గా కొనసాగుతోంది.
ఇదే క్రమంలో ఏపీ తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కడప, అనంతపురం, విశాఖ, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ ధరలు రూ.58,000గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధరలు రూ.63,230గా కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలను పరిశీలిస్తే నేడు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతూ కేజీ ధర రూ.76,000గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications