Gold Price Today: ప్రస్తుతం దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా పెరుగుతూపోతున్న పసిడి ధర చిన్న బ్రేక్ తీసుకుంది. ప్రధానంగా ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుదల రేట్ల పెంపుకు ప్రేరణగా నిలుస్తోంది.
ఈరోజు 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు శ్రావణ శుక్రవారం రోజున పసిడి ప్రియులు ఆభరణాల షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమలో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం రేట్లను గమనిస్తే.. చెన్నైలో రూ.54,830, దిల్లీలో రూ.54,650, ముంబైలో రూ.54,500, కలకత్తాలో రూ.54,500, కేరళలో రూ.54,500, బెంగళూరులో రూ.54,500, వడోదరలో రూ.54,500, జైపూర్ లో రూ.54,650, పాట్నాలో రూ.54,550, మధురైలో రూ.54,830, నాశిక్ లో రూ.54,530గా కొనసాగుతున్నాయి.

అలాగే 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర 10 గ్రాములకు వివిధ ప్రాంతాల్లో రిటైల్ విక్రయ ధరలను చూస్తే.. చెన్నైలో రూ.59,820, ముంబైలో రూ.59,450, కలకత్తాలో రూ.59,450, దిల్లీలో రూ.59,600, బెంగళూరులో రూ.59,450, వడోదరలో రూ.59,500, కేరళలో రూ.59,450, అహ్మదాబాదులో రూ.59,500, మధురైలో రూ.59,820, పాట్నాలో రూ.59,500, జైపూర్ లో రూ.59,600, నాశిక్ లో రూ.59,480గా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, కాకినాడ, అనంతపురం, తిరుపతి, నెల్లూరు, విశాఖ నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.59,450 వద్ద విక్రయించబడుతోంది. తెలంగాణలోని హైదరాబాద్, కరీంగనర్, నిజాంబాద్, ఖమ్మంలలోనూ ఇవే ధరలు రిటైల్ గా కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కిలోకు నిన్నటి కంటే రూ.500 తగ్గిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రూ.79,500 వద్ద రిటైల్ విక్రయ ధరను కొనసాగిస్తోంది.


Click it and Unblock the Notifications