భారతదేశంలో బంగారం ధరలు మరోసారి కొత్త చరిత్రను లిఖించాయి. అమెరికాలో బలహీనమైన ఉద్యోగ డేటా, ఫెడ్ రేటు తగ్గింపు అంచనాల నేపథ్యంలో.. దేశీయ మార్కెట్లో బంగారం ధర పది గ్రాములకు రూ.1,00,870 స్థాయిని అధిగమించింది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక రేటుగా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర 3,377 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గత సంవత్సరం సంబంధించి ఇది 41 శాతం పెరుగుదలగా చెప్పుకోవచ్చు.
ఇంత భారీ పెరుగుదల ప్రధానంగా అమెరికా జాబ్ మార్కెట్ బలహీనత, ఫెడ్ రేటు కట్ గానూ పెట్టుబడిదారుల ఆశలు, భౌగోళిక ఉద్రిక్తతలు, ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణాలుగా చెబుతున్నారు విశ్లేషకులు. జూలైలో విడుదలైన నాన్‌ఫార్మ్ పేరోల్స్ డేటా బలహీనంగా ఉండటంతో.. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో సెప్టెంబర్‌లో జరగనున్న FOMC (ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ) సమావేశంలో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశముందని 94 శాతం ట్రేడర్లు అంచనా వేస్తున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులవైపు మొగ్గుచూపుతున్నారు. అందులో బంగారం ప్రధానమైనదిగా నిలుస్తోంది. అదే సమయంలో, ట్రంప్ మరోసారి కొత్త సుంకాలు విధించబోతున్నారని ఆందోళనలూ ఉన్నాయి. ఇవి ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. IBJA (ఇండియా బులియన్ & జ్యువెల్లర్స్ అసోసియేషన్) ఉపాధ్యక్షురాలు అక్ష కాంబోజ్ మాట్లాడుతూ..పండుగ సీజన్, పెళ్లిళ్ల డిమాండ్, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు.. ఇవన్నీ దేశీయంగా బంగారం ధరలు మరింతగా పెరిగేందుకు కారణమవుతున్నాయని తెలుస్తోంది.
గతంలో 2025లో బంగారం ధరలు 3,100 నుంచి 3,500 డాలర్ల పరిధిలో ఉంటాయని చెప్పిన సిటీ బ్యాంక్ ఇప్పుడు దాన్ని 3,300 నుంచి 3,600 డాలర్లకు పెంచింది. ఫిడెలిటీ, గోల్డ్‌మ్యాన్ సాచ్స్ వంటి దిగ్గజ సంస్థలు కూడా బంగారం విషయమై ఆశాజనకంగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే బంగారం ధరలు శాశ్వతంగా పెరుగుతాయన్న గ్యారంటీ లేదు. లాభాల బుకింగ్, డాలర్‌లో మార్పులు, ఫెడ్ విధానాలు ధరలపై ప్రభావం చూపవచ్చు. కానీ బంగారం కోసం లాంగ్‌టర్మ్ విజన్ మాత్రం బలంగానే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
పెట్టుబడిదారులు ప్రస్తుతం ద్రవ్యోల్బణం, డాలర్ బలహీనత, మార్కెట్ అస్థిరత నేపథ్యంలో బంగారాన్ని సురక్షితమైనదిగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధరలు తాత్కాలికంగా తగ్గినా, దీర్ఘకాలిక దృష్టిలో మాత్రం ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

Gold: అత్యవసరంగా డబ్బు కావాలా? బంగారంతో ఉన్న 'లిక్విడిటీ' అడ్వాంటేజ్ గురించి మీకు తెలుసా?

బంగారం ధరల పెరుగుదలపై లేటెస్ట్ రిపోర్ట్.. సరికొత్త నివేదికను విడుదల చేసిన ప్రముఖ బ్యాంకులు

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

భగ్గుమన్న బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 8, బుధవారం ధరలు ఇవే..

ఈ ఏడాది బంగారం, వెండి పెరుగుదలపై సంచలన నివేదిక.. ఏకంగా ఆ స్థాయి వరకు వెళుతుందంటున్న నిపుణులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!



Click it and Unblock the Notifications