Today Gold Rates: బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు తెప్పిస్తున్నాయి. పసిడి కొనుగోలు చేయాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. గత రెండు మూడు నెలల నుంచి ధరలు నింగిని తాకి కిందకు దిగిరానంటున్నాయి.
దాదాపు లక్ష మార్కును మరి కొద్ది రోజుల్లో దాటనుందనే వార్తలతో సామాన్యులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రధానంగా వివాహాది శుభకార్యాలకు, పంక్షన్లకు బంగారం కొనుగోలు చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసే పరిస్థితి కనిపిస్తోంది.
అయితే భారీ పెరుగుదల మధ్య నేడు బంగారం ధరలు స్పల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,600 పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.87, 790 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక కిలో వెండి లక్ష దాటి రూ. 1.07. 900గా నమోదైంది. ఇక బంగారం ధరలు నేడు రూ. 3 వేలు తగ్గాయి. ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో ధరలు తగ్గడం ఇదే తొలిసారి. హైదరాబాద్, విజయవాడవ వంటి ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 97,960 స్థాయికి చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేటు రూ. 89,790 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఇక ఢిల్లిలో చూసుకున్నట్లయితే.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 98,110గా.. 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 89,940 వద్ద ట్రేడ్ అవుతోంది. ముంబైలో చూసుకున్నట్లయితే 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 97,960 వద్ద.. 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 89,790 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే చెన్నైలో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములు రూ. 97,960 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 89,790 వద్ద ట్రేడ్ అవుతోంది. బెంగుళూరులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 97,960 వద్ద ట్రేడ్ అవుతుండగా.. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 89,790 పలుకుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ బ్యూటిపుల్ సిటీ వైజాగ్ లో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములు రూ. 97,960 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములు రూ. 89,790 వద్ద ట్రేడ్ అవుతోంది.
కాగా అమెరికా- చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టనున్నాయనే వార్తలతో నేడు బంగారం ధరలు స్పల్పంగా తగ్గాయి. ఇక యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాలను వెలువరించడంతో బంగారం ధర కాస్త నేల చూపులు చూసింది. ఇక అగ్రదేశాలు అమెరికా-చైనా మధ్య వాణిజ్యపరమైన చర్చలు జరగనున్నాయి. ఇరుదేశాధి నేతలు లండన్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది.
అమెరికా-చైనా మధ్య చర్చలు నేపథ్యంలో పెట్టుబడిదారులు పెట్టుబడులపై ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆసియా పసిఫిక్ సీనియర్ మార్కెట్ సీనియర్ విశ్లేషకులు కెల్విన్ వాంగ్ సూచించారు. ఈ చర్చల్లో సుంకాల మధ్య ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. అయితే దాని బేస్ లైన్ మాత్రం తగ్గించే అవకాశాలున్నాయని తెలిపారు. అమెరికాలో వ్యాపారం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని అయితే అమెరికాలో పెరుగుతున్న బడ్జెట్ లోటు ద్రవ్యోల్బణపై ఒత్తిళ్లను తగ్గించే అవకాశాలు కల్పించవచ్చని వాంగ్ అన్నారు.
ఇదిలా ఉంటే అమెరికాలో నిరుద్యోగ సమస్య ఎక్కువ గానే ఉంది. దాదాపు 4.2 శాతం వద్ద కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 12 దేశాల పౌరులను అమెరికాలోకి రాకుండా అడ్డుకోవడం కోసం జారీ చేసిన ఉత్తర్వు సోమవారం నుంచి అమల్లోకి రానుంది. ఏదేమైనా చైనా- అమెరికా మధ్య జరగబోయే వాణిజ్య చర్చలు కీలకం కానున్నాయి.ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు ప్రపంచ మార్కెట్లతో పాటు బంగారం ధరలపై కూడా ప్రభావం చూపనున్నాయి.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications