ట్రంప్ మామ వచ్చిన వేళా.. తళుక్కుమన్న బంగారం, వెండి.. స్థిరంగా ధరలు..
నేడు బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. నిన్న అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసాక ప్రపంచంలోనే అత్యంత విలువైన లోహం బంగారం ధర ఏ దిశలో మళ్లుతుందనే తరుణంలో ధరల పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. ఒక విధంగా దిగొస్తాయన్న పసిడి ధరలు సామాన్యులకు నిరాశే మిగిల్చాయి.
ఇండియాలో బంగారంకి ఎంతో ప్రజాదరణ, ప్రాముఖ్యత ఉంది, చైనా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగించే దేశం మనదే. దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు గ్లోబల్ మార్కెట్ రేట్లు, డాలర్‌లో సూచించే దిగుమతి సుంకాలు, పన్నుల వంటి చాల అంశాల ద్వారా మారుతుంటుందది. ఇంకా, బాండ్ ఈల్డ్‌లు, డాలర్ విలువలో మార్పులు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. మరోవైపు 22క్యారెట్ల, 24k క్యారెట్ల బంగారం ధరలు కొంతకాలంగా స్థిరమైన పెరుగుదలను చూపుతున్నాయి.

ఈ రోజు మంగళవారం బంగారం ధర 24 క్యారెట్లకి పది గ్రాములకి రూ. 81,230 వద్ద ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.74,500గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి రూ. 61,000. వెండి ధర ఒక కిలోకి లక్ష రూపాలు దాటి రూ.1,04,000 వద్ద ఉంది.
ఈ ఏడాది మొదటి నుండే బంగారం ధరల ఒత్తిళ్లు సామాన్యులకి చుక్కలు చూపిస్తున్నాయి. ఇక 0107 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు $2,707.19 వద్ద స్థిరంగా ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.7 శాతం తగ్గి $2,730కి చేరాయి. స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.5 శాతం తగ్గి $30.34కి, పల్లాడియం 1.2 శాతం తగ్గి $933.25కి, ప్లాటినం 0.6 శాతం తగ్గి $936.95కి చేరుకుంది.
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు :
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.74,500, 24 క్యారెట్ల ధర రూ.81,230, 18 క్యారెట్ల ధర రూ.61, 00, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.74,500, 24 క్యారెట్ల ధర రూ.81,230, 18 క్యారెట్ల ధర రూ.61, 000, అమరావతిలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.74,500, 24 క్యారెట్ల ధర రూ.81,230, 18 క్యారెట్ల ధర రూ.61, 000, గుంటూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.74,500, 24 క్యారెట్ల ధర రూ.81,230, 18 క్యారెట్ల ధర రూ.61, 000, నెల్లూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.74,500, 24 క్యారెట్ల ధర రూ.81,230, 18 క్యారెట్ల ధర రూ.61, 000, కాకినాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.74,500, 24 క్యారెట్ల ధర రూ.81,230, 18 క్యారెట్ల ధర రూ.61, 000, తిరుపతిలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.74,500, 24 క్యారెట్ల ధర రూ.81,230, 18 క్యారెట్ల ధర రూ.61, 000, కడపలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.74,500, 24 క్యారెట్ల ధర రూ.81,230, 18 క్యారెట్ల ధర రూ.61, 000, అనంతపురంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.74,500, 24 క్యారెట్ల ధర రూ.81,230, 18 క్యారెట్ల ధర రూ.61, 000
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.


Click it and Unblock the Notifications