Gold Rate: ధనత్రయోదశికి ఎవరెస్ట్ అంచుకు గోల్డ్.. నేడు రూ.6,500 పెరిగిన పసిడి ధర..
Gold Price Today: నిన్న పసిడి ధరలు కొంత తగ్గటం భారతీయ కొనుగోలుదారులకు స్వల్ప ఊరటను అందించిన సంగతి తెలిసిందే. అయితే నేడు Dhanteras 2024న గోల్డ్ రేట్లు భారీగా పెరిగి ఎవరెస్ట్ శిఖరాన్ని తాకాయి. దీంతో దీపావళికి ముందు షాపింగ్ చేద్దామని అనుకున్న చాలా మందికి ధరలు షాక్ ఇస్తున్నాయి. దేశీయంగా నేడు కొనుగోళ్లు పెరుగుతాయని భావించిన చాలా మంది ప్రస్తుతం పెరిగిన రేట్లతో గందరగోళంలో ఉన్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.6000 పెరిగి అందరినీ షాక్ కి గురిచేస్తోంది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేటి రిటైల్ విక్రయ పసిడి ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7375, ముంబైలో రూ.7375, దిల్లీలో రూ.7390, కలకత్తాలో రూ.7375, బెంగళూరులో రూ.7375, కేరళలో రూ.7375, వడోదరలో రూ.7380, జైపూరులో రూ.7390, లక్నోలో రూ.7390, మంగళూరులో రూ.7375, నాశిక్ లో రూ.7378, మైసూరులో రూ.7375, అయోధ్యలో రూ.7390, బళ్లారిలో రూ.7375, గురుగ్రాములో రూ.7390, నోయిడాలో రూ.7390 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో నేడు 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.6500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8045, ముంబైలో రూ.8045, దిల్లీలో రూ.8060, కలకత్తాలో రూ.8045, బెంగళూరులో రూ.8045, కేరళలో రూ.8045, వడోదరలో రూ.8050, జైపూరులో రూ.8060, లక్నోలో రూ.8060, మంగళూరులో రూ.8045, నాశిక్ లో రూ.8048, మైసూరులో రూ.8045, అయోధ్యలో రూ.8060, బళ్లారిలో రూ.8045, గురుగ్రాములో రూ.8060, నోయిడాలో రూ.8060గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7375గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8045 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7375గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8045 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.1000 పెరిగి నేడు రూ.1,06,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
10 నిమిషాల్లో ఇంటికి పసిడి..
ధనత్రయోదశి సందర్భంగా అక్టోబర్ 29న క్విక్ కామర్స్ ఫ్లాట్ ఫారమ్‌లు స్విగ్గీ, జొమాటో బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్, జెప్టో, బిగ్ బాస్కెట్ కేవలం 10 నిమిషాల్లోనే తమ కస్టమర్లకు గోల్డ్, సిల్వర్ కాయిన్స్ డెలివరీని అందుబాటులోకి తీసుకొచ్చాయి. పండుగ రోజున వెండి, ఇత్తడి, బంగారం వంటి లోహాలను కొనుగోలు చేయటం ఉత్తమంంగా, విజయాన్ని కలిగించేవిగా ప్రజలు భావిస్తుంటారు. దీనికోసం ఇప్పటికే క్విక్ కామర్స్ కంపెనీలు మార్కెట్లోని ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థలతో జతకట్టాయి. ఇందులో ఒక గ్రాము వరకు గోల్డ్ కాయిన్స్, 10 గ్రాముల వరకు సిల్వర్ కాయిన్స్ విక్రయానికి ఉంచబడ్డాయి.


Click it and Unblock the Notifications