Gold Price Today: వెనక్కి తిరగనంటున్న బంగారం.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు..
Gold Price Today: రానున్న వారంలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వు సమావేశం కానుంది. ఈ క్రమంలో వడ్డీ రేట్లు పెంచుతుందా అనే ఆందోళనల మధ్య బంగారం ధరలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది కొనాలా లేదా ఆగాలా అనే అయోమయంలో ఉన్నారు.
అయితే దాదాపు నాలుగు రోజులుగా బంగారం ధరలు దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు నిన్నటి కంటే రూ.10 స్వల్పంగా పెరిగింది. దీంతో ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,310, ముంబైలో రూ.54,910, దిల్లీలో రూ.55,060, కలకత్తాలో రూ.54,910, బెంగళూరులో రూ.54,910, కేరళలో రూ.54,910, వడోదరలో రూ.54,960, జైపూర్ లో రూ.55,060, కోయంబత్తూరులో రూ.55,310, సూరత్ లో రూ.54,960, నాశిక్ లో రూ.54,940, బళ్లారిలో రూ.54,910 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల బంగారం తాజా ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.60,330, ముంబైలో రూ.59,900, దిల్లీలో రూ.60,050, కలకత్తాలో రూ.59,900, బెంగళూరులో రూ.59,900, కేరళలో రూ.59,900, వడోదరలో రూ.59,950, జైపూర్ లో రూ.60,050, కోయంబత్తూరులో రూ.60,330, సూరత్ లో రూ.59,950, నాశిక్ లో రూ.59,910, బళ్లారిలో రూ.59,900 రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, విశాఖ, అనంతపురం, కడప, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ లలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,910కి విక్రయిస్తుండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,900గా ఉంది. ఇక వెండి ధరలను పరిశీలిస్తే.. స్థిరంగా కొనసాగుతూ కేజీ రూ.78,200గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications