అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు పసిడి ప్రియుల కొంపలు ముంచుతున్నాయి. ట్రంప్ నిర్ణయంతో బంగారం ధరలు ఏకంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మళ్లీ తెరపైకి వచ్చిన నేపథ్యంలో పెట్టుబడిదారులు మళ్లీ బంగారంపై తమ దృష్టిని పెట్టారు. ఈ నేపథ్యంలో ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. భారత దిగుమతులపై అదనంగా 25% దిగుమతి సుంకం విధించడంతో ఉద్రిక్తతలు మళ్లీ చోటు చేసుకున్నాయి. భారత్ మీద ఇప్పటికే ఉన్న 25% టారిఫ్‌తో కలిపి మొత్తం 50% సుంకం అమల్లోకి రానుంది.
ఈ నిర్ణయం ప్రపంచ పెట్టుబడిదారులను ఆలోచనలో పడేసింది. తమ పెట్టుబడులను కాపాడుకోవాలంటే బంగారం ఒక్కటే సురక్షితమని భావిస్తున్నారు. దీంతో Gold ధరలకు మళ్లీ రెక్కలు వస్తున్నాయి. ట్రంప్ తాజా ప్రకటన అనంతరం గురువారం బంగారం ధరల్లో భారీగా పెరుగుదల చోటు చేసుకుంది. స్పాట్ గోల్డ్ ఔన్సుకు 3,378.18 డాలర్లకు చేరుకుంది. ఇది 0.3 శాతం పెరుగుదలగా చెప్పుకోవచ్చు. ఇక US గోల్డ్ ఫ్యూచర్స్ 3,445.60 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది 0.4 శాతం పెరిగింది. ఇంతకు ముందెన్నడూ చూడని స్థాయికి బంగారం ధరలు చేరుకున్నాయి. ఏకంగా 3400 డాలర్ల మార్క్ చేరుకుంది.

బంగారం ధరల పెరుగుదలపై KCM ట్రేడ్ మార్కెట్ విశ్లేషకుడు టిమ్ వాటరర్ మాట్లాడుతూ.. ట్రంప్ విధించిన కొత్త సుంకాలు పెట్టుబడిదారుల్లో భయాన్ని రేకెత్తిస్తున్నాయి. ఇప్పుడు బంగారం రక్షణాత్మక పెట్టుబడిగా వారికి కనిపిస్తోందన్నారు. ట్రంప్ నిర్ణయం కేవలం భారత్‌పైనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య ఒప్పందాలపై భారత్ సూటిగా ప్రశ్నించేలా తయారైంది. ప్రధానంగా భారతదేశం రష్యా ముడి చమురు కొనుగోళ్లను కొనసాగించడమే ట్రంప్ ఆగ్రహానికి కారణమనే మాట కూడా వినిపిస్తోంది.
జూలై 6 తర్వాత 21 రోజుల్లో అమల్లోకి వచ్చే ఈ అదనపు సుంకం..దేశంలో కొన్ని కీలక ఎగుమతులపై భారీ ప్రభావాన్ని చూపనుంది. ఇది అమెరికా వాణిజ్య భాగస్వాములతో ఇప్పటివరకు ఎప్పుడూ పెట్టని అధికంగా ఉన్న సుంక రేటు కావడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే ట్రంప్ అమెరికాకు వెలుపల నుండి దిగుమతి అయ్యే సెమీకండక్టర్‌లపై 100 శాతం దిగుమతి సుంకం విధించనున్నట్లు ప్రకటించారు. అయితే అమెరికాలోనే తయారు చేసే కంపెనీలకు ఈ సుంకం వర్తించదని ఆయన తెలిపారు.
గత వారం US ఉపాధి గణాంకాలు నిరాశాజనకంగా ఉండటంతో డాలర్ ఇండెక్స్ 2025లో అత్యల్ప స్థాయికి చేరుకుంది. దీనివల్ల సెప్టెంబర్‌లో ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. సెప్టెంబర్‌లో 25 బేసిస్ పాయింట్ల డ్డీ రేటు తగ్గింపు జరగబోతుందని CME ఫెడ్‌వాచ్ టూల్ అంచనా వేసింది. వడ్డీ రేట్లు తక్కువగా ఉండే సమయంలో Gold బలపడే అవకాశం ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనం దిశగా సాగుతున్నందున ఫెడ్ త్వరలో రేటు కోతలు అమలు చేయాల్సి రావచ్చని మిన్నియాపాలిస్ ఫెడ్ అధ్యక్షుడు నీల్ కష్కరి చెబుతున్నారు. వచ్చే వారాల్లో ట్రంప్ తీసుకునే చర్యలు బంగారంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

ఇరాన్ తర్వాత ఈక్వెడార్ మీద గురిపెట్టిన అమెరికా... నార్కో-టెర్రరిస్ట్ గ్రూపులను ఏరిపారేస్తున్న ట్రంప్ సైన్యం..

Anthropic: ఇరాన్ దాడిలో ఆంత్రోపిక్ ఏఐ వినియోగం? అమెరికాలో ముదురుతున్న వివాదం!

యుద్ధం మొదలైంది.. అమెరికా సత్తా ఏంటో ఇరాన్‌కు చూపిస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరల పెరుగుదలపై దిమ్మతిరిగే న్యూస్.. గత చరిత్రతో కీలక నివేదికను విడుదల చేసిన Kedia Advisory

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications