అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ అంటే ఆర్థిక వ్యవస్థలోనే కాకుండా ప్రపంచ మార్కెట్లపై కూడా తీవ్ర ప్రభావం చూపే పరిణామంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బంగారం మార్కెట్ విషయంలో దీని ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయ అస్థిరత లేదా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడల్లా పెట్టుబడిదారులు విశ్వసనీయమైన, సురక్షితమైన ఆస్తుల వైపు దృష్టి మళ్లిస్తారు. అలాంటి సమయాల్లో బంగారం ఎప్పటికీ మొదటి ఎంపికగా నిలుస్తుంది.
1980లో తొలిసారి అమెరికాలో ప్రభుత్వ నిధుల ప్రతిష్టంభన కారణంగా చిన్న స్థాయి షట్‌డౌన్ చోటుచేసుకుంది. ఆ సమయంలో బంగారం ధరల్లో పెద్ద మార్పు కనిపించలేదు. అదే విధంగా 1981లో రోనాల్డ్ రీగన్ పాలనలో జరిగిన ఒకరోజు షట్‌డౌన్‌లో కూడా ధరలు స్థిరంగానే ఉన్నాయి. అయితే 1990లో జార్జ్ బుష్ సీనియర్ పాలనలో పన్నులు, మెడికేర్‌పై వివాదం రగిలి, మూడు రోజుల పాటు ప్రభుత్వ పనులు నిలిచిపోయాయి. ఆ సమయంలో బంగారం స్వల్పంగా 0.35 శాతం మేర పెరిగింది.

అసలైన మలుపు 1995-96లో బిల్ క్లింటన్ పాలనలో వచ్చింది. రెండు విడతల్లో మొత్తం 47 రోజుల పాటు సాగిన ఈ సుదీర్ఘ షట్‌డౌన్ అమెరికా రాజకీయాలను కుదిపేసింది. బడ్జెట్‌పై తీవ్రమైన వివాదాలు చెలరేగడంతో పెట్టుబడిదారులలో భయాందోళనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో Gold ధరలు దాదాపు 7.5 శాతం మేర పెరిగి కొత్త స్థాయికి చేరుకున్నాయి. అప్పటి నుంచి షట్‌డౌన్ అంటే బంగారం ధరలు తప్పనిసరిగా ప్రతిస్పందిస్తాయన్న ధోరణి బలపడింది.
భారతదేశంలో టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ 2025
2013లో ఒబామా పాలనలో జరిగిన 16 రోజుల షట్‌డౌన్ కూడా మార్కెట్లను ప్రభావితం చేసింది. మొదట్లో బంగారం పెరిగినా, ఆ తర్వాత క్రమంగా తగ్గి చివరికి 1.34 శాతం తగ్గుదలతో ముగిసింది. ఆ తర్వాత ట్రంప్ మొదటి పదవీకాలంలో 2018 జనవరిలో మూడు రోజుల షట్‌డౌన్ జరిగింది. అది పెద్దగా ప్రభావం చూపకపోయినా.. Gold ధరలు స్వల్పంగా 0.18 శాతం పెరిగాయి. కానీ 2018 చివర్లో ప్రారంభమై 2019 జనవరికి కొనసాగిన 35 రోజుల సుదీర్ఘ షట్‌డౌన్ బంగారం ధరలను మళ్లీ పైకి తీసుకెళ్లింది. ఈ సమయంలో బంగారం 2.84 శాతం మేర పెరిగింది.
ఇప్పుడు 2025లో ట్రంప్ 2.0 పాలనలో జరుగుతున్న షట్‌డౌన్ గత నలభై ఐదు సంవత్సరాల చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైంది. ఆగస్టు, సెప్టెంబర్ నుంచి కొనసాగుతున్న ఈ ప్రతిష్టంభన కారణంగా ప్రభుత్వ ఖర్చులు నిలిచిపోవడమే కాకుండా ఆర్థిక వ్యవస్థలో అస్థిరత పెరిగింది. ఈ పరిస్థితుల్లో బంగారం రికార్డు స్థాయిలో ఎగబాకింది. 3,400 డాలర్ల వద్ద ఉన్న బంగారం, 3,860 డాలర్లకు చేరి దాదాపు 13.5 శాతం పెరిగింది. ఇప్పటి వరకు ఏ షట్‌డౌన్‌లోనూ ఇంతగా పైకి ఎగబాకడం జరగలేదు.
ఇక బంగారం ఎందుకు ఇలాంటి సమయాల్లో పెట్టుబడిదారులకు అగ్ర ఎంపికగా మారుతుందనే ప్రశ్నకు సమాధానం సులభమే. ప్రభుత్వ షట్‌డౌన్‌లు అమెరికా డాలర్ బలహీనతకు దారితీస్తాయి. డాలర్ విలువ తగ్గినప్పుడు Gold ఆకర్షణ మరింత పెరుగుతుంది. పైగా రాజకీయ అనిశ్చితి పెరిగిన కొద్దీ సురక్షితమైన ఆస్తుల అవసరం పెరుగుతుంది. అప్పుడు పెట్టుబడిదారులు Gold వైపు మరింతగా మళ్లుతారు.
గత 45 సంవత్సరాల చరిత్ర చెబుతున్నదేమిటంటే.. ప్రతి అమెరికా షట్‌డౌన్ కూడా బంగారం ధరలను పెంచింది. పెరుగుదల కొన్నిసార్లు స్వల్పంగానే ఉన్నప్పటికీ, కొన్నిసార్లు రికార్డు స్థాయిలో కనిపించింది.ఇక 2025లో జరుగుతున్న ప్రస్తుత షట్‌డౌన్ ఈ నిజాన్ని మరింత బలపరుస్తూ.. బంగారం యొక్క సురక్షిత స్వభావాన్ని మరోసారి నిరూపిస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications