బంగారం ధరలు ఇప్పట్లో తగ్గవంటున్న బ్యాంకింగ్ నిపుణులు.. ప్రధాన కారణం ఏం చెబుతున్నారంటే..
బంగారం ధరలు ఈ నెలలో భారీ పెరుగుదలను నమోదు చేశాయి . Gold ధరలు వరుసగా ఐదో వారంలో లాభాలను నమోదు చేసి పెట్టుబడిదారుల పంట పండించాయి. శుక్రవారం నాటికి అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 0.1% పెరిగి ఔన్సుకు 3,647.68 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అలాగే డిసెంబర్ డెలివరీ కోసం US Gold ఫ్యూచర్స్ కూడా 0.1 శాతం పెరిగి 3,679.90 డాలర్ల వద్ద ముగిసింది. ఈ వారం మొత్తానికి బంగారం ధర 0.2 శాతం పెరిగినట్లు రికార్డు అయ్యింది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ సంవత్సరం మొదటిసారిగా వడ్డీ రేటును తగ్గించింది. సాధారణంగా వడ్డీ రేటు తగ్గితే బంగారం వంటి లోహాలకు డిమాండ్ పెరుగుతుంది, ఎందుకంటే అవి నాన్-ఈల్డ్యింగ్ ఆస్తులు. తక్కువ వడ్డీ వాతావరణంలో పెట్టుబడిదారులు సేఫ్ హేవెన్‌గా బంగారాన్ని ఎంచుకుంటారు. ఈసారి కూడా అదే జరిగడంతో ఫెడ్ చర్య బంగారం ధరలను పెంచింది.

ఇటీవల బుధవారం Gold చరిత్రలోనే గరిష్టమైన ధరను తాకింది. ఔన్సుకు 3,707.40 డాలర్ల వరకు ఎగబాకింది. ఇది బంగారం మార్కెట్లో ఒక కొత్త రికార్డుగా చెప్పుకోవచ్చు. 2024లో 27 శాతం పెరుగుదలను ఇచ్చిన బంగారం ధరలు.. ఈ సంవత్సరం ఇప్పటివరకు 39 శాతం పెరిగాయి. అంటే బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి మరింతగా పెరిగిందని దీనిని బట్టి స్పష్టమవుతుంది.
CME గ్రూప్ యొక్క FedWatch Tool ప్రకారం.. అక్టోబర్‌లో జరిగే ఫెడ్ సమావేశంలో మరోసారి 25 బేసిస్ పాయింట్ల (bps) రేటు కోత వచ్చే అవకాశాలు 92 శాతం ఉన్నాయని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. ఇది నిజమైతే బంగారం ధరలకు మరింతగా ఎగబాకబోతున్నాయి.
Nemo.money చీఫ్ మార్కెట్ అనలిస్ట్ హాన్ టాన్ మాట్లాడుతూ.. బంగారం ధరలు 3,600 డాలర్ల కంటే దిగువకు వస్తే అవి తాత్కాలికమే. తక్కువ కాలంలో తిరిగి పెరుగుతాయని అన్నారు. ఇక విజ్డమ్ ట్రీ కమోడిటీస్ స్ట్రాటజిస్ట్ నితేష్ షా ప్రకారం.. అమెరికా డాలర్ విలువ తగ్గుతూనే ఉండటమే బంగారం ధరలకు ప్రధాన కారణం. ఆయన అంచనా ప్రకారం, వచ్చే ఏడాది ఇదే సమయానికి బంగారం ధరలు దాదాపు 4,300 డాలర్ల వరకు చేరే అవకాశం ఉంది.
బంగారం తో పాటు ఇతర లోహాలు కూడా లాభనష్టాలు నమోదు చేశాయి:
సిల్వర్ (వెండి) ధర 0.7 శాతం పెరిగి ఔన్సుకు 42.06 డాలర్ల వద్ద ఉంది.
ప్లాటినం 0.1 శాతం తగ్గి 1,382.45 డాలర్లకి పడిపోయింది.
పల్లాడియం 0.3 శాతం పెరిగి 1,154.25 డాలర్ల వద్ద ముగిసింది.
క్లుప్తంగా చూసుకున్నట్లయితే..ఫెడరల్ రిజర్వ్ రేటు కోతలు, డాలర్ బలహీనత, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, ప్రపంచవ్యాప్తంగా జియోపాలిటికల్ ఉద్రిక్తతలు.. బంగారం ధరలను గణనీయంగా పెంచుతున్నాయి. కాబట్టి, నిపుణుల అంచనా ప్రకారం, బంగారం 4,300 డాలర్ల లక్ష్యాన్ని చేరడం చాలా సాధ్యమేనని చెప్పవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications