అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూన్ 1 నుంచి యూరోపియన్ యూనియన్ దిగుమతులపై 50 శాతం టారిఫ్ విధించనున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. యూరోపియన్ యూనియన్ సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పలు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. భారతదేశ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ఫ్యూచర్స్ శుక్రవారం, 23 మే 2025న 0.02 శాతం లేదా రూ. 21 తగ్గుతూ ముగిసింది.
MCX నుండి సేకరించిన డేటా ప్రకారం జూన్ 2025 కాంట్రాక్టుకు సంబంధించిన గోల్డ్ ఫ్యూచర్స్ 0.02 శాతం తగ్గి 10 గ్రాములకు రూ. 96,400 వద్ద ముగిసింది. ఇది మునుపటి కమోడిటీ మార్కెట్ ముగింపులో రూ. 96,421 గా ఉంది.

ఇక 2025 జూన్ 1 నుండి యూరోపియన్ యూనియన్ నుండి దిగుమతులపై 50 శాతం సుంకం విధించాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనపై పెట్టుబడిదారుల ఉద్రిక్తతలు తిరిగి పెరగడంతో భారతదేశంలో బంగారం ధరలు, అమెరికాకు చెందిన కామెక్స్ బంగారం ధరలు పెరిగాయి.
కారణం ఏంటంటే: ఐఫోన్ తయారీదారు స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తిని అమెరికాకు తరలించడంలో విఫలమైతే ఫెడరల్ ప్రభుత్వం కనీసం 25 శాతం సుంకాలు విధిస్తుందని ట్రంప్ ఆపిల్ కంపెనీని బెదిరించారు.ఈ ప్రకటనలు పెట్టుబడిదారుల్లో భయాలు రేకెత్తించాయి. దీని ప్రభావంగా పసిడి వంటి భద్రతాపరమైన పెట్టుబడులకు మళ్లీ డిమాండ్ పెరిగింది.
సాధారణంగా అనిశ్చితి సమయాల్లో, పెట్టుబడిదారులు, ప్రభుత్వ ట్రెజరీలు ఈక్విటీ, డెరివేటివ్స్ మార్కెట్ల వంటి అధిక-రిస్క్ ఆస్తుల నుండి తమ డబ్బును వాపస్ తీసుకుంటారు. ఆ డబ్బునంతా సురక్షితమైన పెట్టుబడులైన బంగారం వంటి వాటి మీద పెడతారు.ప్రస్తుతం అమెరికా, ఇతర ప్రపంచ దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం, వాణిజ్య ఉద్రిక్తతలు వంటి కీలక ఆర్థిక సూచికలతో, ఈ విలువైన బంగారపు లోహం ధర "బుల్లిష్" దృక్పథాన్ని కమోడిటీ నిపుణులు పరిశీలిస్తున్నారు.
బంగారం ధరల పెరుగుదల : రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ జిగర్ త్రివేది ప్రకారం.., బంగారం ధరల పెరుగుదల జూన్ 2025 నెల వరకు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. అమెరికా క్రెడిట్ డౌన్‌గ్రేడ్ , చైనా సెంట్రల్ బ్యాంక్ బంగారం కొనుగోళ్లు కొనసాగడం, వాణిజ్య ఉద్రిక్తతలు, మాంద్యం భయాలు వంటి ముఖ్యమైన అంశాలు బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. జూన్ వరకు బంగారం ధర పెరుగుదల కొనసాగే అవకాశం కనిపిస్తోంది. $3,100/oz కంటే తక్కువ ధరకు తగ్గడం చాలా అసంభవమని కమోడిటీ మార్కెట్ నిపుణుడు జిగర్ త్రివేది అన్నారు.
కాగా మార్కెట్లు వచ్చే వారం US ఆర్థిక డేటా విడుదలలను నిశితంగా గమనిస్తాయి. ఇక US-ఇరాన్ అణు చర్చలలో ఏదైనా పురోగతి రిస్క్ ఆస్తులకు తాత్కాలిక ఉపశమనం కలిగించవచ్చు. బంగారం సురక్షితమైన ప్రవాహాలను ఈ చర్చలు ఆకర్షించవచ్చు. ఈ నేపథ్యంలో SPDR గోల్డ్ ETF సంస్థాగత సెంటిమెంట్‌కు కీలకమైన బేరోమీటర్‌గా మిగిలిపోయింది. సమీప కాలంలో, Comex బంగారం ధరలు $3,380-$3,430/oz పరిధిని పరీక్షించవచ్చని త్రివేది అన్నారు.
అమెరికా డాలర్ బలహీనపడటం, అమెరికా ఆర్థిక దృక్పథం గురించి పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా గత వారం బంగారం ధరలు హెచ్చుతగ్గులకు గురయ్యాయని కామా జ్యువెలరీ మేనేజింగ్ డైరెక్టర్ కాలిన్ షా అన్నారు. వచ్చే వారం వరకు బంగారం ధర అంచనాలు బుల్లిష్‌గా ఉన్నాయి, స్వల్పకాలిక దిద్దుబాటుకు అవకాశం ఉంది. అంతర్జాతీయ ధరలు $3300-3400/Oz పరిధిలో ట్రేడవుతాయని అంచనా. దీనికి కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, US ఆర్థిక విధానాలపై అనిశ్చిత దృక్పథం ప్రభావం చూపనున్నాయి. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక అస్థిరతను సూచిస్తుంది" అని ఆయన అన్నారు.
రాబోయే వారంలోబంగారం 10 గ్రాములకు రూ. 95,000 నుండి రూ. 96,000 వరకు ఉండే అవకాశం ఉందని కామా జ్యువెలరీ మేనేజింగ్ డైరెక్టర్ కాలిన్ షా తెలిపారు. ఇక దేశీయ ధరలు రూ. 95,000-96,000/10 గ్రాముల పరిధిలో ఉండవచ్చు . వెండికి, ఏదైనా పెద్ద ఆర్థికాభివృద్ధి ప్రాధాన్యతను సంతరించుకోకపోతే ధరలు సాపేక్షంగా స్థిరంగా ఉండవచ్చని షా అన్నారు. ఏదైమైనా ట్రేడర్‌లు, పెట్టుబడిదారులు ఈ వారం గోల్డ్ మార్కెట్‌ను నిశితంగా పరిశీలించనున్నారు. వీరంతా భద్రతా పెట్టుబడిగా పసిడిపై ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. పసిడి ధరలు స్వల్పంగా తగ్గినా, దీర్ఘకాలికంగా చూస్తే పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

Iran war: యుద్ధం ఎప్పుడు ఆపాలో మేమే తేలుస్తాం.. ఇరాన్ అమెరికా మధ్య ముదురుతున్న మాటల యుద్ధం!

ఒక్క చుక్క చమురు కూడా బయటికి రాదు.. హార్ముజ్ జలసంధి రవాణాపై ట్రంప్‌కు ఘాటు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్..

Iran war: కేవలం గ్యాస్ ఒక్కటే కాదు.. ఈ 5 రంగాలపై భారీ ఎఫెక్ట్ ఉండే అవకాశం?

Iran war: త్వరలోనే యుద్ధం ముగింపు? ట్రంప్ వ్యాఖ్యలతో చమురు ధరల్లో భారీ మార్పు!

Russian oil: ట్రంప్ క్లెయిమ్ VS రియాలిటీ.. రష్యా ఆయిల్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన న్యూఢిల్లీ!

ఇరాన్ తర్వాత ఈక్వెడార్ మీద గురిపెట్టిన అమెరికా... నార్కో-టెర్రరిస్ట్ గ్రూపులను ఏరిపారేస్తున్న ట్రంప్ సైన్యం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications