ఆగస్టులో రూ. 50 వేలకు పైగా పెరిగిన బంగారం ధర.. ఈ నెలలో పసిడి ధరలపై శుభవార్తను మోసుకొస్తున్న ఆర్థిక నిపుణులు
ఆగస్టు నెలలో భారతదేశంలో బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తూ భారీ ఎత్తున పెరిగాయి. బంగారం మాత్రమే కాకుండా వెండి కూడా కొత్త గరిష్టాలను తాకి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించాయి. ఆగస్టు 1న 24 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములకు సుమారు రూ.9,98,200 ఉండగా, ఆగస్టు 31 నాటికి అదే బంగారం ధర రూ.10,49,500 కు చేరుకుంది. అంటే ఒక్క నెలలోనే 100 గ్రాములకు రూ.51,300, 10 గ్రాములకు రూ.5,130 పెరిగిందని చెప్పవచ్చు. మొత్తంమీద Gold ధరలు 5 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. ఇక వెండి విషయానికి వస్తే, ఆగస్టులో 1 కిలో ధర రూ.1,21,000 కు చేరి 7 శాతం కంటే ఎక్కువ పెరిగింది. అంటే వెండి బంగారం కంటే మరింత వేగంగాపెరుగుదల నమోదు చేసింది.
పెట్టుబడిదారులు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు తగ్గిస్తారని ఊహించడం, అలాగే పరిశ్రమల నుంచి వెండి డిమాండ్ పెరగడం వంటి కారణలతో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అమెరికా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం పెట్టుబడిదారులకు బంగారం-వెండి మీద ఆసక్తిని పెంచింది. డాలర్ బలహీనపడటంతో Gold ధరలు పెరిగాయి.అలాగే ఫెడరల్ రిజర్వ్ గవర్నర్లపై ఒత్తిడి, ట్రంప్ సుంకాల దాడులు వంటి విషయాలు కూడా పెట్టుబడిదారులలో భయాన్ని పెంచాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం భయం మధ్య బంగారం, వెండి ఇన్వెస్టర్లకు సురక్షిత పెట్టుబడులుగా మారాయి.

ఇక పెట్టుబడిదారులు, సామాన్యులు సెప్టెంబర్ నెల మీద ఫోకస్ పెడుతున్నారు. ఈ నెలలో బంగారం ధరలు ఎలా ఉంటాయనే దానిపై ముందుగానే అంచనా వేసుకుంటున్నారు. బ్యాంకింగ్ రంగ నిపుణుల ప్రకారం.. ఈ నెలలో Gold ధరలు MCX ఫ్యూచర్ ట్రేడింగ్ లో రూ.98,500 - రూ.1,04,000 మధ్య కదిలే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక వెండి రూ.1,10,000 - రూ.1,21,000 పరిధిలో ట్రేడయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే.. Comexలో బంగారం 3,300 డాలర్ల వద్ద కదలే అవకాశం ఉంది. 3,580 డాలర్ల వద్దకు చేరుకునే అవకాశం ఉంది. ఇక వెండి 36.90 డాలర్ల నుంచి 41.00 డాలర్ల మధ్య కదిలే అవకాశాలు ఉన్నాయి.
మొత్తం మీద చూసుకున్నట్లయితే.. ఆగస్టు నెలలో బంగారం 5 శాతం పెరిగితే, వెండి 7 శాతం కంటే ఎక్కువ పెరిగి..పెట్టుబడిదారులకు లాభాల పండి పడించింది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ మొదటి వారంలో కూడా ధరలు బలంగా కొనసాగవచ్చని నిపుణులు చెబుతున్నారు. సురక్షిత పెట్టుబడులపై డిమాండ్, అమెరికా వడ్డీ రేటు కోతల అంచనాలు, రాజకీయ ఉద్రిక్తతలు.. ఇవన్నీ బులియన్ ధరలకు బలమైన పునాది ఇస్తున్నాయి. దీంతో ఈ నెలలో కూడా బంగారం ధరలు తగ్గే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications