For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా తగ్గి.. హఠాత్తుగా రూ.1,100 పెరిగిన బంగారం ధర, అక్కడ రోజులో 100 డాలర్లు

|

గత కొద్ది రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గుతోన్న విషయం తెలిసిందే. రెండు రోజులుగా మాత్రం పెరుగుతున్నాయి. ఈ రెండు రోజుల్లోనే ధరలు భారీగా పెరిగాయి. స్వల్పంగా తగ్గుతూ రూ.45,000 రికార్డ్ ధర నుండి రూ.40,000 దిగువకు చేరుకున్నాయి. అయితే అంతలోనే కస్టమర్లకు షాకిస్తూ ధరలు పెరిగాయి. బంగారం ధరలు రెండు రోజుల్లో రూ.1,100 వరకు పెరిగాయి.

ఈ రోజు బంగారం ధర ఎంత ఉందంటే? మార్చిలో రూ.3,000 తగ్గుదలఈ రోజు బంగారం ధర ఎంత ఉందంటే? మార్చిలో రూ.3,000 తగ్గుదల

రెండు రోజుల్లోనే భారీగా పెరుగుదల

రెండు రోజుల్లోనే భారీగా పెరుగుదల

బంగారం ధరలు మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లో ఒకటి నుండి రెండు శాతం మేర పెరిగాయి. అంతకుముందు సెషన్‌లో ఏకంగా 4 శాతం పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం ఉదయం 10 గ్రాములకు 1 శాతం లేదా రూ.400 పెరిగి రూ.41,550గా ఉంది. అంతకుముందు సెషన్‌లో రూ.700 పెరిగింది. అంటే రెండ్రోజుల్లో రూ.1100 పెరిగింది. రూ.40వేలకు వచ్చిన బంగారం మరింత తగ్గుతుందేమోనని కొంతమంది చూసి ఉంటారు. అలాంటి వారికి హఠాత్తుగా రెండు రోజుల్లో ఇంత మొత్తం పెరగడం షాక్.

వెండి ధర

వెండి ధర

వెండి ధర ఎంసీఎక్స్‌లో కిలోకు 4.5 శాతం లేదా 1700 డాలర్లు పెరిగి రూ.39,620గా ఉంది. అంతకుముందు సెషన్‌లో ఈ ధర రూ.6 శాతం పెరిగింది. బంగారం ధరలు ఈ నెలలోనే రూ.45,000 మార్క్ చేరుకొని, ఇదే నెలలో రూ.39,500 కూడా చూశాయి.

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లోను స్పాట్ గోల్డ్ ఔన్స్ 2 శాతం పెరిగి 1,583.53 డాలర్లకు చేరుకుంది. అంతకుముందు సెషన్లో 4 శాతం పెరిగింది. ప్లాటినం ధర 4.5 శాతం పెరిగి 671.11 డాలర్లకు, వెండి ధర 5.4 శాతం పెరిగి 13.97 డాలర్లకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఈ నెలలో 1700 డాలర్లకు పైకి కూడా చేరుకుంది.

భారీగా తగ్గి.. ఆ తర్వాత వెంటనే భారీగా పెరిగి..

భారీగా తగ్గి.. ఆ తర్వాత వెంటనే భారీగా పెరిగి..

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఓ సమయంలో భారీగా తగ్గి 1488 డాలర్ల వద్దకు చేరుకుంది. ఆ తర్వాత రోజు కనిష్టం (1488) నుండి 100 డాలర్లు పెరిగి 1588కి చేరుకుంది. బంగారం ధర ప్రారంభ ధరతో పోలిస్తే పెరుగుదల ఏకంగా 7 శాతం ఉంది.

English summary

భారీగా తగ్గి.. హఠాత్తుగా రూ.1,100 పెరిగిన బంగారం ధర, అక్కడ రోజులో 100 డాలర్లు | Gold prices jump Rs.1,100 in two days

Gold rose 2% on Tuesday, extending gains from a near 4% surge in the previous session, after the U.S. Federal Reserve's unprecedented measures to help an economy reeling from the coronavirus pandemic halted a rush for cash.
Story first published: Tuesday, March 24, 2020, 13:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X