శుక్రవారం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.6397 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.5865 గా ఉంది. కిలో వెండి ధర రూ.76,000 గా ఉంది. కిలో వెండి ధర రూ.700 పెరిగింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ.50 వరకు తగ్గినట్లు తెలుస్తోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 57 వేల 700గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57, 800, 24 క్యారెట్ల బంగారం ధర రూ.63, 050 గా ఉంది.
చెన్నైలో 10గ్రాముల బంగారం ధర రూ.64530 గా ఉంది. వెండి కిలో ధర రూ.77,500 ఉంది. ఢిల్లీ 10 గ్రాముల బంగారం ధర రూ.63,970 ఉండగా.. వెండి ధర కిలో రూ.76000 గా ఉంది. ముంబైలో 10 గ్రాముల బంగారం ధర రూ.63,820 ఉండగా.. వెండి కిలో ధర రూ.76,000 ఉంది. కోల్‌కతాలో బంగారం ధర రూ.63,820 ఉండగా.. వెండి కిలో ధర రూ.76,000 గా ఉంది. అటు అంతర్జాతీయంగానూ బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం స్పాట్ బంగారం ధర ఔన్సుకు 2023 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

బంగారం, వెండి ధరలపై అంతర్జాతీయ, దేశీయ డిమాండ్ ప్రభావితం చూపుతాయి. దీపావళి వరకు తగ్గుతూ వచ్చిన పుత్తడి ధర ఆ తర్వాత పెరుగుతూ వచ్చింది. జనవరి నుంచి తగ్గుతూ వస్తూ మళ్లీ పెరుగుతోంది. చాలా మంది బంగారంపై పెట్టుబడి పెట్టాలని చూస్తారు. అయితే పెట్టుబడిలో 10 నుంచి 20 శాతం మాత్రమే పుత్తడిపై పెట్టుబడి పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications