ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అనిశ్చితులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు అంచనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అన్నీ కలిపి బంగారం ధరలను పైకి తీసుకువెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సుకు 3,550 డాలర్లు దాటిన తర్వాత, భారతదేశంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధరలు ఈరోజు 10 గ్రాములకు రూ.1,06,970 వద్ద రికార్డు గరిష్టాన్ని నమోదు చేశాయి. 2025లో ఇప్పటికే 33 శాతం పెరిగిన బంగారం ధరలు రాబోయే నెలల్లో మరింత ఎగబాకుతాయని ఐసీఐసీఐ బ్యాంక్ ఎకనామిక్ రీసెర్చ్ గ్రూప్ తాజా నివేదిక అంచనా వేసింది.
ఈ నివేదిక ప్రకారం.. 2025 మిగిలిన కాలంలో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.99,500-రూ.1,10,000 మధ్య ట్రేడయ్యే అవకాశం ఉంది. 2026 మొదటి అర్ధభాగంలో అయితే ధరలు మరింత పెరిగి రూ.1,10,000-రూ.1,25,000 పరిధిని తాకవచ్చని అంచనా వేసింది. అయితే ఈ అంచనాలు ప్రధానంగా రూపాయి విలువపై ఆధారపడి ఉన్నాయని నివేదిక హెచ్చరించింది. ఈ నివేదిక అంచనాల ప్రకారం USD/INR జత సగటున 87-89 పరిధిలో ట్రేడ్ అవుతుందని భావిస్తోంది. కానీ రూపాయి దీనికంటే ఎక్కువగా బలహీనపడితే, ఈ అంచనాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఐసీఐసీఐ రీసెర్చ్ నోట్ స్పష్టం చేసింది.

ప్రపంచ మార్కెట్ వైపు చూస్తే, బంగారం ధరలు 2025లో ఇప్పటివరకు ఔన్సుకు దాదాపు 33 శాతం పెరిగాయి. దీనికి ప్రధాన కారణాలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై కొనసాగుతున్న ఆందోళనలు, ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య సడలింపు అంచనాలు అని చెప్పవచ్చు. విశ్లేషకులు ఈ సంవత్సరం మిగిలిన భాగంలో ప్రపంచ బంగారం ధరలు ఔన్సుకు 3,400 డాలర్ల నుంచి 3,600 డాలర్ల మధ్య సగటుగా ఉండవచ్చని భావిస్తున్నారు. 2026 మొదటి అర్ధభాగంలో అయితే ఈ పరిధి 3,600 డాలర్ల నుంచి 3,800 డాలర్లకి బలపడే అవకాశముందని నివేదిక చెబుతోంది.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రమైతే ఈ అంచనాలకు మించి Gold ధరలు పెరిగే అవకాశం ఉందని కూడా నివేదిక పేర్కొంది.
ఏదేమైనా USలో జరిగే పరిణామాలే బంగారం ర్యాలీని ముందుకు నడిపిస్తాయని అంచనా వేసింది. ఇందులో 2025-26లో ఫెడరల్ రిజర్వ్ నుంచి అంచనా వేసిన 125 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు కోతలు, అలాగే US డాలర్‌పై కేంద్ర బ్యాంకులు, గ్లోబల్ పెట్టుబడిదారులు కొనసాగిస్తున్న వైవిధ్యీకరణ ముఖ్యంగా ఉన్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక బలహీనత, స్థూల ఆర్థిక అనిశ్చితులు.. బంగారం ధరలు పెరుగుదలకు కారణమవుతున్నాయి.
ఇక దేశీయ మార్కెట్లో రూపాయి బలహీనత బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతోంది. జూన్‌లో USD 1.8 బిలియన్లుగా ఉన్న బంగారం దిగుమతులు, జూలై 2025లో USD 4.0 బిలియన్లకు పెరిగాయి. ఇది పండుగ సీజన్ ముందు బలమైన స్థానిక డిమాండ్‌ను ప్రతిబింబిస్తుంది. గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFs)లో పెట్టుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది వైటిడి ఇన్ఫ్లోలు రెట్టింపుకి పైగా ఉన్నాయని నివేదిక హైలైట్ చేసింది.
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) డేటా ప్రకారం, జూలైలో నికర ఇన్‌ఫ్లో రూ.12.6 బిలియన్లు, జూన్‌లో ఉన్న రూ.20.8 బిలియన్ల కంటే తక్కువే అయినా, మొత్తం వైటిడి ఇన్ఫ్లో రూ.92.8 బిలియన్లు-గత సంవత్సరం ఇదే కాలంలో కనిపించిన రూ.45.2 బిలియన్లను మించిపోయాయి.రూపాయి విలువ అంచనా వేసిన 87-89 పరిధిని దాటి మరింత బలహీనపడితే, ఈ సానుకూల అంచనాలు సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుందని ఐసీఐసీఐ రీసెర్చ్ హెచ్చరించింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం, వెండి ధరలు తగ్గాయి. తాజా రేట్లు ఇక్కడ చూడండి

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు ర్యాలీ చేసిందంటే.. ఏప్రిల్ 11, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు



Click it and Unblock the Notifications