ఏడేళ్లలో రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు, ఎంతలా పెరిగాయంటే..
భారతదేశంలో బంగారం ధరలు గత ఏడు సంవత్సరాలలో ఊహించని స్థాయిలో పెరిగాయి. 2018-19లో 10 గ్రాములకు సగటున రూ. 31,193గా ఉండి, 2024-25లో రూ. లక్షకు పైకి చేరాయి. ఇది మొత్తం 143 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఇది ప్రపంచ మార్కెట్ ధోరణులను మించి భారతదేశంలో Gold పెట్టుబడికి పాపులర్ ఆప్షన్‌గా మారిపోయింది. ఇక వెండి ధరలు కూడా చాలా వేగంగా పెరిగాయి. ముంబైలో 1 కిలో వెండి ధర ₹38,404 నుండి ₹89,131కి పెరిగింది.ఆసక్తికర అంశం ఏంటంటే బంగారం విలువ వెండితో పోలిస్తే ఎంత వేగంగా పెరుగుతుందో తెలుస్తుంది. ఇది పెట్టుబడిదారులకు అత్యంత కీలకమైన మార్కెట్ ట్రెండ్ సూచికగా మారింది.
ఈ సమయంలో ముఖ్యంగా ధంతేరస్, దీపావళి వంటి పండుగల సమయానికి కుటుంబాలు బంగారం, వెండిని కొనుగోలు చేయడం సాంప్రదాయం. ఇది సంపదను కాపాడే మార్గంగా కూడా భావించబడుతుంది. చాలా మంది మహిళలు దీనిని ఆర్థిక భద్రత కోసం చిన్న పెట్టుబడిగా చూస్తున్నారు. ముంబైలో బంగారం ధరలు లండన్‌లో అంతర్జాతీయ ధరల కంటే స్థిరంగా ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకి, 2023-24లో ధరల వ్యత్యాసం రూ. 7,939.53కి చేరింది. 2024-25లో ముంబై సగటు ధర రూ. 75,842 కాగా, లండన్ సగటు ధర రూ. 70,315. ఇది ప్రధానంగా పండుగలు, వివాహాలు, రూపాయి మార్పులతో సంబంధం కలిగి ఉంది.

ఈ ఆర్థిక అనిశ్చితి సమయంలో, పెట్టుబడిదారులు బంగారం, కమోడిటీ ఫండ్లను ప్రాధాన్యతగా ఎంపిక చేస్తున్నారు. ఈ వారంలో కమోడిటీ ఫండ్లకు 1.19 బిలియన్ల డాలర్ల పెట్టుబడులు వచ్చాయి, ఇది 2020 తర్వాత అత్యుత్తమ ప్రదర్శనగా చెప్పవచ్చు. గత వారం 16 బిలియన్ల డాలర్ల ఇన్‌ఫ్లో వచ్చిన తర్వాత, ఈ వారం కూడా మరో 8.4 బిలియన్ల డాలర్ల పెట్టుబడి వచ్చింది. ఈ పెరుగుదల సాంస్కృతిక విలువతో పాటు ఆర్థిక అస్థిరత సమయంలో భద్రమైన ఆస్తులుగా బంగారం, వెండి ప్రాముఖ్యతను హైలైట్ చేస్తోంది. దేశీయ-అంతర్జాతీయ ధరల వ్యత్యాసం పెట్టుబడిదారులకు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications