Gold Price Today: దేశంలో బంగారం విక్రయ ధరలు గతంలో ఎన్నడూ చూడని రీతిలో పడిపోతున్నాయి. దీంతో బులియన్ మార్కెట్లోని వ్యాపారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 10 రోజులుగా ఇదే ధోరణి కొనసాగుతోంది. శ్రావణ మాసం ప్రారంభంతో మధ్యతరగతి ప్రజలు కొనుగోళ్లపై దృష్టి పెట్టారు.
22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు నిన్నటి కంటే రూ.350 మేర తగ్గింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.54,560, ముంబైలో రూ.54,100, దిల్లీలో రూ.54,250, కలకత్తాలో రూ.54,100, బెంగళూరులో రూ.54,100, కేరళలో రూ.54,100, వడోదరలో రూ.54,150, జైపూర్ లో రూ.54,250, మధరైలో రూ.54,560, నాగపూర్ లో రూ.54,100, సూరత్ లో రూ.54,150, నాశిక్ లో రూ.54,130 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములుకు నిన్నటి కంటే రూ.380 పడిపోయింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.59,520, ముంబైలో రూ.59,020, దిల్లీలో రూ.59,170, కలకత్తాలో రూ.59,020, బెంగళూరులో రూ.59,020, కేరళలో రూ.59,020, వడోదరలో రూ.59,070, జైపూర్ లో రూ.59,170, మధరైలో రూ.59,520, నాగపూర్ లో రూ.59,020, సూరత్ లో రూ.59,070, నాశిక్ లో రూ.59,020గా ఉన్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన పసిడి ధరలను గమనిస్తే.. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, కడప, కాకినాడ, అనంతపురం, తిరుపతి, నెల్లూరుల్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,100 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.59,020గా రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ లలో సైతం ఇవే రేట్లకు విక్రయాలు జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణల్లో వెండి ధరలను పరిశీలిస్తే రూ.500 క్షీణించిన తర్వాత కేజీ రూ.75,700గా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications