నేడు బంగారం, వెండి ధరలు పసిడి ప్రియులకి షాకిచ్చాయి. దింతో 10 గ్రాముల ధర రూ.350 నుండి రూ.380 వరకు పెరిగింది. అలాగే వెండి ధర కూడా పసిడి బాటలోనే ఇవాళ ఒక్కరోజే రూ.1000 పెరిగింది. అయితే గత వారంలో చూస్తే స్వల్ప తగ్గుదలతో ఊరట కల్పించిన బంగారం ధరలు నేడు ఒక్కసారిగా ఎగిశాయి. ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్న రేట్లు రానున్న రోజుల్లో లక్ష దాటుతుందా లేదా దిగొస్తుందా అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే కొద్దిరోజుల క్రితం బంగారం ధర మొట్టమొదటిసారి లక్ష దాటి పసిడి ప్రియులకు షాకిచ్చింది. అంతేకాక అక్షయతృతీయకి కనికరిస్తుందనుకున్న పసిడి ధరలు సామాన్యులకు నిరాశే మిగిల్చాయి. ఇక పెళ్లిళ్ల సీజన్, పండగ సమయాల్లో బంగారం, వెండి కొనుగోళ్లు ఎక్కువ మొత్తంలో చేస్తుంటారు. కానీ ధరల పెరుగుదల కారణంగా కస్టమర్లు తక్కువ మొత్తంలో కొనేందుకే పరిమితం అవుతున్నారు. దింతో జ్యువెలరీ షాపులు కూడా ఆశించినంతగా అమ్మకాలు జరగట్లేదు.

ఇక భవిష్యత్తులో బంగారం ధర ఏ మేరకు పరుగులు పెడుతుందో, ఎలాంటి ట్రెండ్ కొనసాగిస్తుందో అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రపంచ పరిస్థితులు అనుకూలంగా మారితే రానున్న నెలల్లో బంగారం ధర భారీగా పడిపోవచ్చని, లేదంటే తులం ధర లక్ష దాటిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెబుతున్నారు.
అంతర్జాతీయ పరిణామాలు: అమెరికా అండ్ చైనా మధ్య సుంకాల ఉద్రిక్తతలు తగ్గడం అలాగే భారతదేశం ఇంకా పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఇప్పటికీ అమలులో ఉండటంతో, ప్రపంచ మార్కెట్ సంకేతాలు చాలా అనుకూలంగా మారాయి. మూడీస్ రేటింగ్స్ అమెరికా ప్రభుత్వ క్రెడిట్ రేటింగ్‌ను 'Aaa' నుండి 'Aa1'కి తగ్గించడంతో, ఆసియా మార్కెట్లలో బంగారం ధర 1.3% పెరిగి ఔన్సుకు $3,245కి చేరింది.
గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి: బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి గోల్డ్ ఈటీఎఫ్‌లు (Gold ETFs) ఒక మంచి అప్షన్. వీటి ద్వారా నిల్వ ఖర్చులు, తయారీ ఛార్జీలు తగ్గించుకోవచ్చు. గత సంవత్సరంలో బంగారం ధర 30% పెరిగింది. 2001 నుండి 15% కాంపౌండ్ అన్యువల్ గ్రోత్ రేటు (CAGR)ను రిజిస్టర్ చేసింది. అలాగే 1995 నుండి చూస్తే ద్రవ్యోల్బణాన్ని 2-4% అధిగమించింది. ఈ గణాంకాలు బంగారం దీర్ఘకాలిక పెట్టుబడికి ఎంత సురక్షితమో తెలియజేస్తున్నాయి.
భారతదేశంలో బంగారం ధరలు మారడానికి కారణాలు: అంతర్జాతీయ మార్కెట్ రేట్లు, దిగుమతి సుంకాలు, పన్నులు ఇంకా విదేశీ మారకపు రేట్లలో హెచ్చుతగ్గులు ప్రధానంగా భారతదేశంలో బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ఈ అంశాలు అన్ని కలిసి దేశవ్యాప్తంగా ప్రతిరోజు బంగారం ధరలను నిర్ణయిస్తాయి. ఇండియాలో బంగారంకి లోతైన సాంస్కృతిక చరిత్ర ఉంది. ముఖ్యంగా వేడుకలు, వివాహాలు ఇంకా పండుగలల్లో కీలకం.
ప్రస్తుతం 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.35 పెరిగి రూ.8,755, 24 క్యారెట్ల ధర రూ.38 పెరిగి రూ.9,551, 18 క్యారెట్ల ధర రూ.28 ఎగిసి రూ.7,163. దింతో 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ.87,550, నిన్నటి ధర రూ.87,200 అంటే రూ.350 పెరగ్గా, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ.95,510, నిన్నటి ధర చూస్తే రూ.95,130 దింతో రూ.380 పెరిగింది, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.71,630, నిన్నటి ధర రూ.71,350 అంటే రూ.280 పెరుగుదల నమోదు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు చూస్తే : వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.87,200, 24 క్యారెట్లకు రూ.95,130, 18 క్యారెట్లకు రూ.71,350. కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.87,200, 24 క్యారెట్లకు రూ.95,130, 18 క్యారెట్లకు రూ.71,350. ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.87,200, 24 క్యారెట్లకు రూ.95,130, 18 క్యారెట్లకు రూ.71,350. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.87,550, 24 క్యారెట్లకు రూ.95,510, 18 క్యారెట్లకు రూ.71,630.
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి ధరలు చూస్తే : విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.87,550, 24 క్యారెట్లకు రూ.95,510, 18 క్యారెట్లకు రూ.71,630. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.87,550, 24 క్యారెట్లకు రూ.95,510, 18 క్యారెట్లకు రూ.71,630. అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.87,550, 24 క్యారెట్లకు రూ.95,510, 18 క్యారెట్లకు రూ.71,630. గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.87,550, 24 క్యారెట్లకు రూ.95,510, 18 క్యారెట్లకు రూ.71,630. నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.87,550, 24 క్యారెట్లకు రూ.95,510, 18 క్యారెట్లకు రూ.71,630. కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.87,550, 24 క్యారెట్లకు రూ.95,510, 18 క్యారెట్లకు రూ.71,630. తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.87,550, 24 క్యారెట్లకు రూ.95,510, 18 క్యారెట్లకు రూ.71,630. కడపలో 22 క్యారెట్ల ధర రూ.87,550, 24 క్యారెట్లకు రూ.95,510, 18 క్యారెట్లకు రూ.71,630. అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.87,550, 24 క్యారెట్లకు రూ.95,510, 18 క్యారెట్లకు రూ.71,630.
మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాముకి రూ.98గా ఉండగా, 10 గ్రాములకి రూ.980, కేజీకి నేడు రూ.98,000 అంటే ఇవాళ వెండి ధర రూ.1,000 పెరిగింది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.98,000, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,09,000.
0025 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 1.4 శాతం పెరిగి $3,247.40 డాలర్ల వద్ద ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 2 శాతం పెరిగి $3,251.90 డాలర్ల వద్ద ఉంది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.8 శాతం పెరిగి $32.52 డాలర్లకి చేరుకుంది, ప్లాటినం 0.6 శాతం పెరిగి $993.70 డాలర్లకి చేరుకుంది అలాగే పల్లాడియం 0.7 శాతం పెరిగి $966.98 డాలర్లకి చేరుకుంది.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.


Click it and Unblock the Notifications