బంగారం కొనాలనుకుంటున్నారా...? అయితే, ఒక్కసారి ఆగండి.. ఫిబ్రవరి మాసంలో కొన్నిరోజులు బంగారం ధరలు కొనేటట్టుగా ఉన్నా..? మార్చి ఒకటో తేది నుంచే బంగారం ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పుడు ఒక్కసారిగా పసిడి ధరలు పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. మార్చి నెల ఇలా వచ్చిందో లేదో పసిడి రేట్లు అమాంతం పెరిగిపోయాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న సంకేతాల నడుమ పుత్తడి రేట్లు ఒక్కసారిగా పెరిగినట్లు తెలుస్తోంది.
ఇక, తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ పసిడి ధర ఔన్సుకు 2083 డాలర్లకు పెరిగింది. స్పాట్ సిల్వర్ రేటు మళ్లీ 23 డాలర్లకు చేరుకుంది. డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ క్రమంగా మెరుగుపడుతోంది. ప్రస్తుతం రూ. 82.83 వద్ద కొనసాగుతోంది. దేశీయంగా ఉన్న పుత్తిడి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవలి కాలంలో భారీగా తగ్గుతూ వచ్చిన పుత్తడి ధర ఇప్పుడు ఒక్కసారిగా రూ. 310 చేరింది.

దీంతో ఇప్పుడు తులం బంగారం రేటు 22 క్యారెట్లపై రూ. 58,050 మార్కుకు చేరింది. ఇదే 24 క్యారెట్ల బంగారం ఢిల్లీలో అయితే10 గ్రాములపై రూ. 320 పెరిగింది. రూ. 63,310 మార్కుకు చేరింది. ఇక భాగన్యగరంలోని బంగారు ధరలు చూస్తే 22 క్యారెట్లపై రూ. 310 పెరిగి 10 గ్రాములు రూ. 57,900 మార్కుకు చేరింది. 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 330 పెరిగగా 63,160 రూపాయలకి చేరింది.
వెండి ధరలకు రెక్కలు...
ఇక, పుత్తడి ధరల దారిలో వెండి ధరలు కూడా ఎగబాకుతున్నాయి. తాజాగా వెండి ధర రూ. 500 పెరగగా, కిలో రూ. 76,200 మార్కుకు చేరింది. ఢిల్లీలో అయితే, రూ. 300 పెరిగి, ప్రస్తుతం వెండి ధర రూ. 74,500 మార్కుకు చేరింది. బంగారం, వెండి ధరలు ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయి. పిబ్రవరి నెలలో వరుసగా పడిపోతూ వచ్చిన పసిడి ధరలు కాస్త మార్చి ఒకటో తేదీ రాగానే అమాంతం పెరిగాయి. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా బంగారం, వెండి రేట్లు పెరిగాయి.


Click it and Unblock the Notifications