ఆగస్టు 14 గురువారం.. ప్రపంచ బులియన్ మార్కెట్లలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు సెప్టెంబర్‌లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గించే అవకాశం పెంచడంతో పాటుగా US డాలర్ బలహీనపడటంతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. మరోవైపు.. ఉక్రెయిన్ వివాదంపై అమెరికా-రష్యా మధ్య జరగబోయే చర్చలపై పెట్టుబడిదారులు ఇప్పుడు దృష్టి పెట్టారు.
KCM ట్రేడ్ చీఫ్ మార్కెట్ విశ్లేషకుడు టిమ్ వాటరర్ మాట్లాడుతూ..అలాస్కాలో ట్రంప్-పుతిన్ భేటీ యుద్ధ సమస్యకు పరిష్కారం అవ్వకపోతే.. బంగారం ధరలు 3,400 డాలర్ల వరకు చేరే అవకాశం ఉందని తెలిపారు. ఆగస్టు 12న విడుదలైన అమెరికా CPI డేటా ప్రకారం, జూలైలో వినియోగదారుల ధరలు 0.2 శాతం పెరిగాయి (జూన్‌లో 0.3 శాతం వృద్ధి తరువాత).వార్షిక ప్రాతిపదికన CPI 2.7 శాతం పెరగడం, సుంకాల ఆధారిత ధరల ఒత్తిడులు తగ్గుతున్న సంకేతాలు వినిపిస్తున్నాయి. డాలర్ సూచీ బలహీనత,సొంత కరెన్సీ ఉన్న దేశాల పెట్టుబడిదారులకు బంగారం మరింత ఆకర్షణీయంగా మారేలా చేసింది. ఈ డేటా ప్రభావంతో.. మార్కెట్లు సెప్టెంబర్ ఫెడ్ రేటు కోతకు 90 శాతం అవకాశాన్ని ఊహిస్తున్నాయి. దీంతో బంగారం ధరలు ప్రభావానికి లోనవుతున్నాయి.

అమెరికా-చైనా వాణిజ్య చర్చలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఇరు దేశాలు తమ సుంకాల ఒప్పందాన్ని 90 రోజులు పొడిగించడంతో పాటు అదనపు సుంకాలను వాయిదా వేసాయి. మరోవైపు, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా-రష్యా చర్చలు ఎటు తిరుగుతాయన్నదానిపై పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు. ఇవన్ని భవిష్యత్తులో బంగారం ధరల మార్పుపై అంచనాలు పెంచుతున్నాయి. ఒకవేళ ఈ చర్చలు సఫలం కాకపోతే Gold ధరలు మళ్లీ నింగిని తాకే అవకాశం ఉంది.
ఇండియా బులియన్ & జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) సమాచారం ప్రకారం.. భారత మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 10,135 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 9,290, 18 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 7,601 వద్ద ఉంది. IBJA వైస్ ప్రెసిడెంట్ అక్ష కాంబోజ్ ప్రకారం.. ప్రపంచ అనిశ్చితి కారణంగా బంగారం డిమాండ్ పెరగింది. దీంతో ధరలు 10 గ్రాములకు రూ 1 లక్ష స్థాయి వరకు తీసుకెళ్లిందని తెలిపింది. ఇక వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా ప్రకారం 2025లో భారత బంగారం వినియోగం ఐదు సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోవచ్చని అంచనా వేసింది. ఆభరణాల డిమాండ్ తగ్గినా.. పెట్టుబడిదారుల డిమాండ్ కొంత ఊపు ఇస్తుందని తెలిపింది.
ఏది ఏమైనా.. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, డాలర్ బలహీనత.. ఈ మూడు అంశాలు కలసి బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. అయితే, యుద్ధ చర్చలు, ఫెడ్ పాలసీ నిర్ణయాలు, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల పురోగతి..ఈ అంశాలన్నీ రాబోయే వారాల్లో Gold గమనాన్ని నిర్ణయించనున్నాయి.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications