పెరుగుతూ వస్తున్న బంగారం ధరకు బ్రేకులు పడ్డాయి. శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.280 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 250 తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,750 గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,600 గా ఉంది. అటు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతోన్నాయి. వెండి కిలో రూ. 89,200 గా ఉంది.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,750 గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,590 గా ఉంది. విశాఖపట్నం, కరీంనగర్ లో కూడా ఇదే ధరలు కొనసాగుతోన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,900 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,750 గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర 67,600 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,750 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,950 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. రూ.73,850 గా ఉంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.92,500లుగా ఉంది. విశాఖపట్నంలో రూ. 92500, కరీంనగర్ లో రూ.92500 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం అంటే రా బంగారమని అర్థం, 22 క్యారెట్ల బంగారం అంటే ఆభరణాలు. మీరు 24 క్యారెట్ల బంగారం కొనుగోలు చేసి ఆభరణాలు చేయిస్తే ఆ పుత్తడి 22 క్యారెట్ల బంగారంగా మారుతుంది. ఆభణం చేయాలంటే బంగారంలో రాగి లోహం కలపాలి. అప్పుడు పుత్తడి నాణ్యత 22 క్యారెట్లకు తగ్గుతుంది.


Click it and Unblock the Notifications