బంగారం ధరలు భారీగా పెరుగుతూ.. స్వల్పంగా తగ్గుతున్నాయి. శుక్రవారం ఎంసీఎక్స్‌లో 10 గ్రాములకు 0.4 శాతం తగ్గి రూ.44,238 వద్ద క్లోజ్ అయింది. అంతకుముందు రూ.44,961 రికార్డ్ హైకి చేరుకుంది. వెండి ధర కిలో 0.43 శాతం తగ్గి రూ.47,170 వద్ద క్లోజ్ అయింది. అంతకుముందు ఇది రూ.50,123 రికార్డ్ హైకి చేరుకుంది.

ఢిల్లీ మార్కెట్లో...
భారతీయ మార్కెట్లలో పలుచోట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.45,000 దాటి రికార్డ్ హైకి చేరుకుంది. కరోనా వైరస్ ప్రభావంతో ఇన్వెస్టర్లు సురక్షిత బంగారం వైపు చూస్తున్నారు. దీంతో ధర భారీగా పెరుగుతోంది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో నిన్న 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం రూ.770 పెరిగి రూ.45,340కి చేరుకుంది. గురువారం ధర రూ.44,570 వద్ద ఉంది.

రూపాయి పతనం..
ఓ వైపు ఈక్విటీల నేలచూపు, మరోవైపు రూపాయి పతనంతో ఇన్వెస్టర్లు పసిడి వైపు చూస్తున్నారని, దీంతో ధరలు భారీగా పుంజుకున్నాయని చెబుతున్నారు. బంగారంతో పాటు వెండి మరింత పెరిగింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో కిలో వెండి రూ.190 పెరిగి రూ.48,180కు చేరుకుంది. న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,678 డాలర్లు పలుకగా, వెండి 17.34 డాలర్లుగా ఉంది. అయితే ఆదివారం మాత్రం ధరలు తగ్గాయి.

బంగారం కొనుగోలు తగ్గడంతో... కొత్త ప్లాన్
ఇండియాలో బంగారం ధరలు భారీగా పెరుగుతుండటంతో కొనుగోళ్లు కూడా తగ్గుతున్నాయి. దీంతో అమ్మకాలు పెంచుకునేందుకు బులియన్ డాలర్లు భారీ డిస్కౌంట్స్ ఇచ్చేందుకు కూడా మొగ్గు చూపుతున్నారు. చైనా, హాంగ్‌కాంగ్‌లలోను బంగారం కొనుగోలుపై ఆసక్తి తగ్గింది.

5 నెలల గరిష్టానికి డిస్కౌంట్
దేశంలోని డీలర్లు దాదాపు ఔన్స్‌కు దాదాపు 25 డాలర్ల మేర తగ్గింపు ఇస్తున్నారట. గత సెప్టెంబర్ నుండి 14 డాలర్ల డిస్కౌంట్ ఉంది. బంగారం ధరపై డిస్కౌంట్ 5 నెలల గరిష్టానికి చేరుకుంది.

ఫిబ్రవరిలో భారీగా పడిపోయిన బంగారం దిగుమతులు
ఇటీవల డాలరు మారకంతో రూపాయి 16 నెలల కనిష్టానికి పడిపోయింది. కరోనా వైరస్ ప్రభావం వల్ల ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఫిబ్రవరిలో బంగారం దిగుమతులు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 41 శాతం పడిపోయాయి.
More From GoodReturns

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు



Click it and Unblock the Notifications