రెండ్రోజుల్లో రూ.500కు పైగా పడిపోయిన బంగారం ధర
బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. ఎంసీఎక్స్ ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ బుధవారం 10 గ్రాముల బంగారం 0.42 శాతం లేదా రూ.169 తగ్గి రూ.40,073గా ఉంది. అంతకుముందు సెషన్లో 0.85 శాతం లేదా రూ.345 తగ్గింది. వెండి రేటు కూడా కిలోకు 0.32 శాతం తగ్గి రూ.45,329గా ఉంది. బంగారం ధర రెండు రోజుల్లో రూ.500కు పైగా తగ్గింది. వెండి ధర రూ.1,600కు పైగా తగ్గింది.
ఇక ఢిల్లీలో వెండి ధర బుధవారం ఒక్క రోజే రూ.1,083 తగ్గి రూ.46,610 వద్ద ఉంది. వెండి రూ.182 తగ్గి 41,019గా ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ పుంజుకోవడం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గడం వంటి వివిధ కారణాలు ధరలపై ప్రభావం చూపింది. పైగా స్థానిక నగల వ్యాపారులు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేదు. దీంతో ధరలు తగ్గాయి.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ ధర 1,565.69 డాలర్లుగా ఉంది. వెండి ఔన్స్ 17.44 డాలర్లుగా ఉంది. భారత్‌లో ఆభరణాలకు డిమాండ్ ఎక్కువ. బంగారం, ఆభరణాలపై పెట్టుబడులకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఇటీవలి కాలంలో బంగారం తన వెలుగును కోల్పోతోంది. మందగమనం, కరోనా వైరస్, అంతర్జాతీయ మార్కెట్లలో ఎగుడు దిగుడులు, ధరల పెరుగుదల కారణంగా బంగారానికి డిమాండ్ తగ్గింది.


Click it and Unblock the Notifications