వారం క్రితం వరకు ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు ఆరు రోజులుగా కిందకు దిగి వస్తున్నాయి. బుధవారం కూడా ధరలు చాలా స్వల్పంగా తగ్గాయి. రికార్డ్ హై ధర (రూ.45వేలకు పైగా) పోల్చుకుంటే ధర రూ.5వేలకు పైగా తక్కువగా ఉంది. మంగళవారం ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.800 తగ్గి 10 గ్రాములకు రూ.38,755 వద్ద ఉంది. అంటే గత ఐదు సెషన్లలో రూ.5,000 గ్గింది. మొత్తంగా నిన్నటి వరకు రూ.5,500 వరకు తగ్గింది. బుధవారం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం మరింత తగ్గింది.

2.5 శాతం తగ్గుదల
కరోనా వైరస్ కారణంగా నిన్నటి వరకు సురక్షిత పెట్టుబడిగా భావించి బంగారంపై ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు ఇప్పుడు నగదు రూపంలో దాచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఈ రోజు బంగారం ధర 2.5 శాతం మేర తగ్గింది. స్పాట్ గోల్డ్ 2.5 శాతం తగ్గి 1,490.81 డాలర్లకు చేరుకుంది. అంతకుముందు 1 శాతం పెరిగినప్పటికీ తర్వాత తగ్గింది.

ప్రజల్లో ఆందోళన
యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 2.3 శాతం తగ్గి 1,491.40 డాలర్ల వద్ద ఉంది. ఆర్థిక మాంద్యం వస్తుందని ప్రజలు భయపడుతున్నారని, దీంతో వీటిని అమ్మి చేతిలో నగదు దాచుకుంటున్నారని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కరోనా దెబ్బకు ఇప్పటికే మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. అంతకుముందు యూఎస్ పెడ్ రిజర్వ్ ప్రకటన తర్వాత 2 శాతం పెరిగినప్పటికీ తర్వాత తగ్గింది.

అందుకే స్వల్ప పెరుగుదల
వివిధ కారణాల వల్ల కొన్నిచోట్ల బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో బంగారం ధరలు రూ.311 పెరిగి రూ.40,241 వద్ద ఉంది. మంగళవారం ఇక్కడ రూ.39,930 వద్ద క్లోజ్ అయింది. అయితే మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం స్వల్పంగా పెరగడంతో ఈ ప్రభావం పడింది. కానీ ఆ తర్వాత గ్లోబల్‌గా తగ్గింది.

పది రోజుల క్రితం ఎంత, ఇప్పుడెంత
హైదరాబాద్‌లో బంగారం ధరలు (24 క్యారెట్లు) బుధవారం రూ.730 పెరిగి రూ.41,382కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం రూ.39,462గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్చి 10వ తేదీన రూ.44,342 ఉండగా, మార్చి 11వ తేదీ నుండి తగ్గుతూ ఇప్పుడు రూ.41వేల దిగువకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం మార్చి 10వ తేదీన రూ.42,192 ఉండగా ఈ రోజు రూ.38,732కు చేరుకుంది.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు, కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, కారణం ఏంటంటే..

Gold prices: వెండితో పోలిస్తే బంగారం సేఫేనా? ఈ రిపోర్ట్ చూస్తే మీ పెట్టుబడి ప్లాన్ మార్చుకుంటారు!



Click it and Unblock the Notifications