మళ్లీ తగ్గిన బంగారం ధరలు, ఈ రోజు ధర ఎంతంటే?
బంగారం ధరలు మళ్లీ పడిపోయాయి. గురువారం (మార్చి 26) ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.75 శాతం తగ్గి రూ.41,900 వద్ద నిలిచింది. గోల్జ్ ఫ్యూచర్స్ జూన్ 0.4 శాతం పడిపోయి రూ.42,650గా ఉంది. మే వెండి కాంట్రాక్ట్స్ 1.7 శాతం తగ్గి కిలోకు రూ.41,003 వద్ద ఉంది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూూచర్స్ నిన్న 2 శాం పెరిగిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం బంగారం రూ.45 వేల రికార్డ్ గరిష్టానికి చేరుకున్న తర్వాత భారీగా తగ్గింది. అ తర్వాత స్వల్పంగా పెరుగుతూ తగ్గుతూ ఊగిసలాడుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుదల
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఔన్స్ స్పాడ్ గోల్డ్ ధర 0.6 శాతం తగ్గి 1,604.16 డాలర్లుగా ఉంది. ఇతర అతివిలువైన లోహాల విషయానికి వస్తే వెండి 0.4 శాతం తగ్గి 14.37 డాలర్లు, ప్లాటినమ్ 1.6 శాతం తగ్గి 726.48 డాలర్లుగా ఉంది. అంతకుముందు రోజు (మంగళవారం) బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 5 శాతం పెరిగాయి.

అమెరికా ఉద్దీపన ప్యాకేజీ
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి అమెరికా 2 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ఆమోదించనున్న నేపథ్యంలో నేడు ఏప్రిల్ ఫ్యూచర్స్ బంగారం ధరలు పడిపోయాయి. అమెరికా సెనెట్ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రభావం బంగారంపై పడింది.

మద్దతు ధర
ప్రస్తుతం కరోనా వల్ల ఆర్థిక సంక్షోభం దిశగా ప్రపంచం పయనిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్దీపనలు అవసరం. ఈ సమయంలో బంగారం రూ.42,600 రేంజ్‌లో ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో 1,590 డాలర్లుగా పైగా సస్టెయిన్ అవుతుందని, 1,660 డాలర్ల వద్ద టఫ్ రెసిస్టెన్స్ ఉంటుందని, 1,585 వద్ద మద్దతు లభిస్తుందని పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications