అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఊహించినట్లుగానే వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించింది. అయితే, చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు మరింత జాగ్రత్త ధోరణిని సూచించడంతో డాలర్ బలపడింది. దీని ప్రభావం Gold ధరలపై పడింది.బుధవారం రికార్డు స్థాయిలో ఔన్సుకు 3,707.40 డాలర్లకు చేరుకున్న బంగారం, గురువారం నాటికి 0.2 శాతం తగ్గి 3,653.54 డాలర్ల వద్దకు వచ్చింది. అమెరికా డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 0.8 శాతం తగ్గి 3,688.10 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. డాలర్ 0.2 శాతం పెరగడంతో ఇతర కరెన్సీలను కలిగి ఉన్న పెట్టుబడిదారులకు బంగారం మరింత ఖరీదైనదిగా మారింది.
ఫెడ్ రేటు కోతలు సాధారణంగా బంగారానికి అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే తక్కువ వడ్డీ రేట్లు బులియన్‌ను కలిగి ఉండటంలో ఉండే అవకాశ ఖర్చును తగ్గిస్తాయి. కానీ ఈసారి పావెల్ రిస్క్-మేనేజ్‌మెంట్ కోత అని పేర్కొనడం, భవిష్యత్తులో వేగంగా రేట్లు తగ్గించే అవకాశాలు తక్కువనే సంకేతం ఇవ్వడం పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని తగ్గించింది. ముఖ్యంగా అమెరికా ఉద్యోగ మార్కెట్ బలహీనంగా మారుతుందన్న ఆందోళనలకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం ఆధారిత ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ SPDR Gold Trust హోల్డింగ్స్ 979.95 టన్నుల నుంచి 975.66 టన్నులకు పడిపోయాయి. ఇది పెట్టుబడిదారుల లాభాల బుకింగ్‌ను సూచిస్తుంది.

2024లో 27 శాతం పెరిగిన Gold ధరలు, ఈ ఏడాది ఇప్పటివరకు 39 శాతం వృద్ధిని సాధించాయి. దీని వెనుక ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య సడలింపు అంచనాలు, భౌగోళిక ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. భారతదేశంలో, పాత బంగారు ఆభరణాలు, నాణేల సరఫరా కొరతగా ఉంది. ఎందుకంటే, పెట్టుబడిదారులు ధరలు మరింత పెరుగుతాయని భావించి తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్మడానికి ముందుకు రావడం లేదు.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ (US Fed) వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు (0.25%) తగ్గించిన తర్వాత అంతర్జాతీయంగా డాలర్ బలపడింది. ఈ ప్రభావం భారతీయ బులియన్ మార్కెట్‌పై కూడా పడింది. కాగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటు, ఈ సంవత్సరం చివరినాటికి మరో రెండు రేటు కోతలు ఉండవచ్చని సంకేతాలిచ్చింది. ఫెడ్ విధాన ఫలితాల తర్వాత డాలర్ ఇండెక్స్ 0.20 శాతానికి పైగా పెరిగింది. డాలర్ బలపడటం వల్ల ఇతర కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టే వారికి బంగారం ఖరీదైనదిగా మారింది. దీని కారణంగా అంతర్జాతీయ బంగారం ధరలు తగ్గాయి.
జిగర్ త్రివేది (Reliance Securities)అభిప్రాయం ప్రకారం.. భారతీయ మార్కెట్లో పెట్టుబడిదారులు ఇంకా బంగారం ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు. అందుకే వారు అమ్మకాలకు ముందుకు రావడం లేదని తెలిపారు. అనుజ్ గుప్తా (SEBI-రిజిస్టర్డ్ నిపుణుడు)అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుత స్థాయిల్లో కొనుగోలు కాకుండా, ధరలు పడిపోయినప్పుడు మాత్రమే బంగారం కొనాలని సిఫార్సు చేస్తున్నారు.ఇక అజిత్ మిశ్రా (Religare Broking) ప్రకారం..ధరలు 3,650 డాలర్ల పైన ఉన్నంత వరకు పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతుందని తెలిపారు.
అలాగే మనోజ్ కుమార్ జైన్ (Prithvifinmart) ప్రకారం.. ఈ వారం ధరలు అస్థిరంగా ఉంటాయి. బంగారం 3,654 డాలర్ల వద్ద కొనుగోలు చేయాలి సూచించారు. అలాగే 3,764 డాల్లర వద్ద కొనుగోలు బంద్ చేయాలని తెలిపారు. రాహుల్ కలాంత్రి (Mehta Equities) అభిప్రాయం ప్రకారం.. బంగారం రూ. 1,09,140 వద్దకు వచ్చినప్పుడే కొనుగోలు మీద ఆసక్తి చూపాలన్నారు. అలాగే రూ. 1,10,500 వద్ద కొనుగోలు ఆపేయాలని చెబుతున్నారు. మెజార్టీ నిపుణులు అభిప్రాయం ప్రకారం.. బంగారాన్ని ఇప్పుడే కొనుగోలు చేయకుండా ధరలు తగ్గినప్పుడు మాత్రమే కొనుగోలుకు ఎంట్రీ ఇవ్వాలని సిఫార్సు చేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

ఈ ఏడాది బంగారం, వెండి పెరుగుదలపై సంచలన నివేదిక.. ఏకంగా ఆ స్థాయి వరకు వెళుతుందంటున్న నిపుణులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications