గత వారం బంగారం ధరలు ఎంత భారీగా.. హఠాత్తుగా తగ్గుతూ వచ్చాయో ఈ వారం అలాగే పెరిగాయి. నాలుగు రోజుల్లోనే 10 గ్రాములకు బంగారం ధర రూ.4,000 వరకు పెరిగింది. అయితే ఈ రోజు (శుక్రవారం, మార్చి 27) ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారం కొనుగోలుదారులకు కొంతలో కొంత ఊరట కల్పించింది. నేడు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఏప్రిల్ బంగారం ఫ్యూచర్స్ ధర 0.8 శాతం తగ్గి రూ.43,195గా ఉంది.

రూ.4,000 వరకు పెరిగి..
ఇంతకుముందు ఒక్క సెషన్‌లోనే బంగారం ధర 10 గ్రాములకు 3 శాతం లేదా 1,300 పెరిగింది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 0.5 శాతం తగ్గి 43,420గా ఉంది. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి 0.08 శాతం తగ్గి రూ.41,290గా ఉంది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ గత నాలుగు రోజులుగా భారీగా పెరుగుతోంది. సోమవారం నుండి గురువారం వరకు 10 గ్రాములకు రూ.3,700 పెరిగింది.

రూ.350 తగ్గుదల
ఈ నెలలో రికార్డ్ గరిష్టం రూ.45,000కు చేరుకున్న బంగారం ధర ఆ తర్వాత కాస్త దిగి వచ్చింది. గత వారం రూ.40,000 దిగువకు చేరుకుంది. కానీ మళ్లీ పెరుగుదల ప్రారంభమైంది. దీంతో రూ.43 వేలను దాటేసింది. ఈ రోజు మాత్రం ఉదయం రూ.351 తగ్గి రూ.43,191 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 0.5 శాతం తగ్గి ఔన్స్‌కు 1,621.07 డాలర్ల వద్ద ఉంది. మొత్తంగా ఈ వారంలో బంగారం ధర 8 శాతం మేర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో గత పదేళ్లలో ఓ వారంలో బంగారం ధర భారీగా పెరిగే రికార్డు దిశగా వెళ్తోంది. కానీ ఈ రోజు తగ్గడం ఊరట కలిగించే అంశం.

ఖరీదైన లోహాలు...
మిగతా అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే ప్లాటినమ్ ఔన్స్ 0.5 శాతం పడిపోయి 732 డాలర్ల వద్ద, వెండి 0.2 శాతం పడిపోయి 14.35 డాలర్ల వద్ద ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ETF) గురువారం 046 శాతం పెరిగి 953.54 టన్నులకు చేరుకుంది.
More From GoodReturns

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!



Click it and Unblock the Notifications