అంతర్జాతీయ బంగారం, వెండి మార్కెట్లలో ఈ వారం ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. గురువారం MCXలో బంగారం అక్టోబర్ ఫ్యూచర్స్ ధరలు రూ.99,000/10 గ్రాముల వద్ద ట్రేడవుతున్నాయి. ఇవి రూ.304 లేదా 0.31% తగ్గాయి. కేవలం ఒక వారంలోనే పసిడి ధరలు రూ.1,200 మేర పడిపోవడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో వెండి సెప్టెంబర్ కాంట్రాక్టులు రూ.47 లేదా 0.04% స్వల్పంగా తగ్గి రూ.1,12,506/కిలో వద్ద ఫ్లాట్‌గా ఉన్నాయి.
కాగా బుధవారం Gold, వెండి రెండూ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో లాభాలతో ముగిశాయి. బంగారం అక్టోబర్ ఫ్యూచర్స్ 0.62% పెరిగి రూ.99,304/10 గ్రాములకు చేరుకోగా, వెండి సెప్టెంబర్ కాంట్రాక్టులు 1.08% లాభంతో రూ.1,12,553/కిలో వద్ద నిలిచాయి. అంటే ఒక్క రోజులోనే ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.
ఈ అస్థిరత వెనుక ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానాలపై ఉన్న అనిశ్చితి అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ వారం చివర్లో జరగబోయే జాక్సన్ హోల్ సింపోజియంలో ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగంపై పెట్టుబడిదారుల దృష్టి నిలిచింది. ద్రవ్యోల్బణం, ఉద్యోగ మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఫెడ్ వడ్డీ రేట్లను ఎంత వేగంగా తగ్గిస్తుందన్నది బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపనుందని తెలుస్తోంది.

FOMC తాజా సమావేశ అంశాలు కూడా ఈ జాగ్రత్త ధోరణినే ప్రతిబింబించాయి. కొందరు సభ్యులు సెప్టెంబర్‌లో రేటు కోతను సమర్థిస్తున్నప్పటికీ, మరికొందరు ఇంకా ఎదురుచూడాలనే అభిప్రాయంలో ఉన్నారు. ఈ అనిశ్చితి బంగారం ధరలపై నేరుగా ప్రతిబింబిస్తోంది. ప్రస్తుతం బంగారం అంతర్జాతీయంగా 3,400 డాలర్ల స్థాయికి దిగువన కదులుతుండగా, తదుపరి మద్దతు 3,340 (సుమారు రూ.98,500) వద్ద ఉండవచ్చని అంచనా. ఇక ఈ ధోరణి కొనసాగితే 3,445 (సుమారు రూ.1,00,500) వద్ద కనిపిస్తోంది.
మనోజ్ కుమార్ జైన్ (Chief Operating Officer (COO) of MCX ) ప్రకారం, Gold రూ.98,650-99,000 మధ్యకు చేరుకునే అవకాశం ఉంది.ప్రస్తుతం ఇది రూ.99,720-1,00,100 మధ్యలో ఉందన్నారు. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు రూ. 98 వేల దిగువకు వస్తే కొనడం మంచిదని చెబుతున్నారు.
ఇక వెండి విషయంలో ఆయన సూచన మరింత స్పష్టంగా ఉంది. రూ.1,11,800-1,11,200 శ్రేణిలో తగ్గుదల వస్తే కొనుగోలు చేయాలన్నారు. లక్ష్యం రూ.1,13,300-1,14,000గా ఉంచాలని సూచిస్తున్నారు. స్టాప్ లాస్ మాత్రం రూ.1,10,450 వద్ద పెట్టాలని సలహా ఇస్తున్నారు.
ఇక డాలర్ ఇండెక్స్ (DXY) కూడా బంగారం కదలికలకు కీలక కారణం అవుతోంది. గురువారం అది 0.18% లాభపడి 98.39 వద్ద నిలిచింది. డాలర్ బలపడినప్పుడు బంగారం ధరలు సాధారణంగా ఒత్తిడికి గురవుతాయి. అందుకే పసిడి ధరలు పడిపోతున్నాయి.
క్లుప్తంగా చెప్పాలంటే, బంగారం, వెండి ధరలు ప్రస్తుతం పెట్టుబడిదారుల జాగ్రత్త ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. ఫెడ్ ఛైర్మన్ ప్రసంగం మార్కెట్లకు తదుపరి దిశ చూపే అవకాశం ఉంది. పెట్టుబడిదారులు ఇప్పుడు గట్టి లాభాలకన్నా కొనేస్థాయి, వదిలే స్థాయిల చుట్టూ వ్యూహాత్మకంగా కదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. బంగారం ధరలు రూ.98,500కి దిగితే మరింత ఒత్తిడి రావచ్చు. అదే సమయంలో వెండి రూ.1,12,000 దాటి స్థిరపడితే మళ్లీ మెరుగైన లాభాలకు దారితీయవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కేడియా అడ్వైజరీ షాకింగ్ అంచనా.. పసిడి, సిల్వర్ కొనడం బంద్ చేయాల్సిందేనా..

Gold reserves: ఈ చిన్న దేశం కొంటున్న బంగారం చూస్తే కళ్లు చెదరాల్సిందే!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పసిడి రేటు భారీ ర్యాలీతో ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 15, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలపై దిమ్మతిరిగే న్యూస్.. పసిడి ధర భారీగా పెరగడానికి ఈ మూడే కారణం.. భవిష్యత్తులో కూడా..

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Today Gold Silver Rate Live: అమెరికా ఇరాన్ చర్చల తర్వాత పెరిగిన బంగారం ధరలు

ఐస్ క్రీం బండి మీద తక్కువ ధరకే బంగారం అమ్మకం.. విశాఖ బీచ్ వద్ద ఎగబడుతున్న కస్టమర్లు. .వీడియో ఇదిగో..

Today Gold Silver Rate Live: బంగారం, వెండి ధరలు పతనం.. ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold: బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? బిస్కెట్లు, కాయిన్స్ ఎక్కడ కొంటే ఎక్కువ లాభం?

Gold: అత్యవసరంగా డబ్బు కావాలా? బంగారంతో ఉన్న 'లిక్విడిటీ' అడ్వాంటేజ్ గురించి మీకు తెలుసా?



Click it and Unblock the Notifications