Gold Rate: కుప్పకూలిన గోల్డ్ రేటు.. రూ.2,800 పడిపోయిన పసిడి.. ఏపీ, తెలంగాణ రేట్లివే..
Gold Price Today: అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో నేడు దేశీయంగా పసిడి ధరలు మూడో రోజు కూడా తమ పతనాన్ని కొనసాగించాయి. దీపావళి, దసరా వంటి పండుగలకు ఆభరణాలను కొనుగోలు చేయాలనుకుంటున్న అనేక మంది పసిడి ప్రియులు సంతోషంలో మునిగితేలుతున్నారు. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత గోల్డ్ రేట్లు క్షీణించటం తీవ్రమయ్యాయి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.2800 పతనాన్ని నమోదు చేశాయి. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.6825, ముంబైలో రూ.6825, దిల్లీలో రూ.6840, కలకత్తాలో రూ.6825, బెంగళూరులో రూ.6825, కేరళలో రూ.6825, పూణేలో రూ.6825, వడోదరలో రూ.6830, జైపూరులో రూ.6840, లక్నోలో రూ.6840, మంగళూరులో రూ.6825, నాశిక్ లో రూ.6828, అయోధ్యలో రూ.6840, నోయిడాలో రూ.6840, బళ్లారిలో రూ.6825, గురుగ్రాములో రూ.6840 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.2500 తగ్గింపును చూసింది. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన రిటైల్ రేట్లను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7445, ముంబైలో రూ.7445, దిల్లీలో రూ.7460, కలకత్తాలో రూ.7445, బెంగళూరులో రూ.7445, కేరళలో రూ.7445, పూణేలో రూ.7445, వడోదరలో రూ.7450, జైపూరులో రూ.7460, లక్నోలో రూ.7460, మంగళూరులో రూ.7445, నాశిక్ లో రూ.7448, అయోధ్యలో రూ.7460, నోయిడాలో రూ.7460, బళ్లారిలో రూ.7445, గురుగ్రాములో రూ.7460గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6825గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7445 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.96,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్ 18న వడ్డీ రేట్లను తగ్గించింది. ఇది COVID-19 మహమ్మారి ప్రారంభమైన తర్వాత మొదటి రేటు తగ్గింపు. దీంతో వడ్డీ రేటు రెండు దశాబ్దాల గరిష్ఠ స్థాయి 5.3% నుంచి దాదాపు 4.8%కి తగ్గించబడింది. ఈ క్రమంలో గోల్డ్ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు ఔన్సుకు 0.9% పెరిగాయి. దీంతో ఔన్సు బంగారం ధర 2,592.39 డాలర్ల వద్ద ఉండగా.. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.2% పెరిగి 2,598.60 డాలర్ల వద్ద ఉన్నాయి.


Click it and Unblock the Notifications