భారీగా తగ్గిన బంగారం ధరలు, రూ.2000 తగ్గుదల: సెన్సెక్స్ భారీ రికవరీ
బంగారం ధరలు శుక్రవారం భారీగా పడిపోయాయి. ఎంసీఎక్స్‌లో ఈ రోజు ఉదయం గోల్డ్ ఫ్యూచర్స్ 10గ్రాములకు రూ.763 పడిపోయి రూ.41,443 వద్ద ఉంది. వెండి ధర కిలో రూ.1,000 (2 శాతం) తగ్గి రూ.43,179గా ఉంది. అంతకుముందు సెషన్‌లో బంగారం 10 గ్రాములకు రూ.1,000 తగ్గింది. వెండి రూ.1,600 తగ్గింది. బంగారం రెండు రోజుల్లో రూ.2,000 వరకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1.3 శాతం పడిపోయి 1,555.42 డాలర్ల వద్ద ఉంది. అంతకుముందు సెషన్‌లో 3.6 శాతం పడిపోయింది. సోమవారం ఔన్స్ బంగారం 1700 మార్క్ దాటిన విషయం తెలిసిందే.
భారత్ సహా ప్రపంచ మార్కెట్లు కరోనా వైరస్ కారణంగా తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. ఈ వారంలో సోమ, నిన్న గురువారం తీవ్ర నష్టాలపాలైన మార్కెట్లు ఈ రోజు కూడా భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. కానీ ఆ తర్వాత కాస్త కోలుకున్నాయి. చివరకు లాభాలతో ముగిశాయి. ఓదశలో 4500 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ అత్యధిక రికవరీని నమోదు చేసింది.

ఉదయం సెన్సెక్స్ 3,000 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. దీంతో 29,388కు పడిపోయింది. తిరిగి రికవరీలో 34,434 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీ కూడా మూడు శాతం లాభాలను నమోదు చేసింది. 8555 వద్ద కనిష్టస్థాయికి చేరిన నిఫ్టీ 10,068 పాయింట్ల వరకు ఎగబాకింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.50 వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications