రూ. 63 నుంచి రూ. 1.24 లక్షల దాకా.. బంగారం ధర పెరుగుదల చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

భారతదేశంలో బంగారం ధరలు ఈ ఏడాది ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఒకప్పుడు 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ. 63,000 వద్ద ఉండగా, ఇప్పుడు అది ఏకంగా రూ. 1.24 లక్షలకు పైగా పెరిగింది. ఈ పెరుగుదల కేవలం మార్కెట్ లోని డిమాండ్ వల్ల కానే కాదని చెప్పవచ్చు. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు అన్నీ కలిపి బంగారాన్ని మరింత విలువైన ఆస్తిగా మార్చాయి.

గత కొన్నినెలలుగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు రిస్కీ ఆస్తుల కంటే సురక్షితమైన పెట్టుబడులను ఆశ్రయిస్తున్నారు. అమెరికా, చైనా, యూరప్‌లలో ఆర్థిక మందగమనం భయాలు పెరుగుతుండటంతో, పెట్టుబడిదారులు "సేఫ్ హేవన్"గా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు కూడా బంగారం ధరలను పెంచుతున్నాయి. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు డాలర్ బలహీనమవుతుంది, దాంతో Gold మరింత ఆకర్షణీయమవుతుంది. ఎందుకంటే బంగారం డాలర్‌లోనే ట్రేడ్ అవుతుంది.

gold price today gold price in india gold price rise 2025 why gold prices are increasing gold price prediction 2025 gold price trend gold rate today gold market analysis gold price forecast gold price news gold investment 2025 24 carat gold rate global gold prices gold inflation hedge india bullion market gold vs inflation gold demand 2025 us dollar and gold safe haven assets reasons for gold price rise 2025 24 2025

జియోపాలిటికల్ ఉద్రిక్తతలు: ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణలు, ఉక్రెయిన్ యుద్ధం, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. ప్రతి సారి ప్రపంచ రాజకీయాలు అనిశ్చితంగా మారినప్పుడు, పెట్టుబడిదారులు స్టాక్స్, క్రిప్టో కరెన్సీల నుండి బయటకు వచ్చి బంగారం వైపు మారుతారు. దీంతో Gold "ప్రపంచ కరెన్సీ"గా పరిగణించబడుతుంది. కరెన్సీ విలువలు పడిపోయినా, బంగారం విలువ సాధారణంగా పెరుగుతుంది. ఈ ఏడాది కూడా అదే జరిగింది.

భారతదేశం బంగారం పెరుగుదల: ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారం వినియోగదారుగా భారత్ ఉంది. పండుగలు, వివాహాలు, సాంప్రదాయ అలవాట్ల వల్ల ఇక్కడ బంగారానికి ఎప్పుడూ పెద్ద డిమాండ్ ఉంటుంది. 2025 ఆరంభంలో Gold ధర పెరుగుతుందని తెలుసుకున్న వినియోగదారులు ముందుగానే కొనుగోలు చేయడం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆదాయాలు పెరగడం వల్ల కూడా బంగారం కొనుగోలు పెరిగింది. భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) కూడా తన గోల్డ్ రిజర్వ్‌లను పెంచుతోంది. ఈ అన్ని అంశాలు కలిపి దేశీయ మార్కెట్‌లో బంగారం కొరతను సృష్టించాయి, దాంతో ధరలు రికార్డు స్థాయికి చేరాయి.

బంగారం వెలికితీత: భూమి నుండి ఇప్పటివరకు 1,87,200 టన్నుల బంగారాన్ని వెలికితీసినట్లు ప్రపంచ బంగారు మండలి చెబుతోంది. ప్రతి దేశం తమ బంగారు నిల్వలను పెంచుకోవడాన్ని తమ హోదాగా భావిస్తుంది. ప్రపంచ ఆర్థిక అస్థిరత కాలంలో బంగారం సురక్షితమైన ఆస్తి అనే మనస్తత్వమే సాధారణ కుటుంబాల నుండి పెద్ద దేశాల కేంద్ర బ్యాంకుల వరకు అందరూ బంగారాన్ని కొనుగోలు చేయడానికి కారణం.

డాలర్ బలహీనంతో బంగారం ధర పెరుగుదల : 2025లో అమెరికా డాలర్ సూచీ (DXY) గణనీయంగా బలహీనమైంది. డాలర్ విలువ పడిపోతే, ఇతర దేశాల పెట్టుబడిదారులకు బంగారం చౌకగా కనిపిస్తుంది. దాంతో వారు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తారు. ఈ ఫారిన్ డిమాండ్ కూడా ధరలను పెంచింది. అంతేకాకుండా, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే సంకేతాలు ఇవ్వడం వల్ల బంగారం పెట్టుబడిగా మరింత ఆకర్షణీయమైంది. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు బంగారం ధర సాధారణంగా పెరుగుతుంది, ఎందుకంటే బంగారంపై వడ్డీ ఆదాయం ఉండదు కాబట్టి పెట్టుబడిదారులు దాన్ని దీర్ఘకాలిక భద్రతగా ఉపయోగిస్తారు.

60 ఏళ్లలో బంగారం ధర మార్పు: గత 60 సంవత్సరాలలో భారతదేశంలో బంగారం ధర ఎలా ఉందో, బంగారం ధర గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు ఇప్పుడు చూద్దాం. 1965లో భారతదేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ. 63 గా ఉంది. కేవలం రూ. 63కి అమ్ముడైన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నేడు రూ. 1,24,000. దీన్ని చూస్తే, 60 సంవత్సరాలలో బంగారం ధర ఎంత విపరీతంగా పెరిగిందో మనకు తెలుస్తుంది.

బంగారం ధర ఎప్పుడు పెరిగింది: 1979లో మధ్యప్రాచ్యంలో ఘర్షణలు ఒక్కసారిగా పెరిగాయి. ఇరాన్ విప్లవం తర్వాత మధ్యప్రాచ్యంలో ఏర్పడిన అస్థిరత బంగారం ధరను పెంచింది. ఆ సమయంలో, భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.937కి అమ్ముడైంది. ఆ తరువాత 1987లో ప్రపంచ స్టాక్ మార్కెట్ భారీ క్షీణతను చవిచూసింది. బంగారం ధర గరిష్ట స్థాయికి చేరుకుని రూ.2570కి పెరిగింది. ఇక 2008లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మళ్లీ కుప్పకూలింది. దీంతో బంగారం ధర రూ. 12,500 గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇక 2012లో యూరోపియన్ బాండ్ రుణ సమస్య ప్రారంభమైంది. ఆ సమయంలో భారతదేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 31,000 రూపాయల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇక 2019లో మధ్యప్రాచ్యంలో యుద్ధం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అస్థిరత, యుద్ధ ఉద్రిక్తతలు బంగారం ధరను 10 గ్రాములకు 35,220 రూపాయలకు పెంచాయి

కోవిడ్ సమయంలో పెరుగుదల: 2020లో కరోనా మహమ్మారి సమయంలో అన్ని పరిశ్రమలు స్తంభించిపోయాయి. దీని కారణంగా, భారతదేశంలో బంగారం ధర రూ.48,651కి పెరిగింది. ప్రస్తుతం, బంగారం ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిలో ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,24,000కి చేరుకుంది.

క్రిప్టో మార్కెట్ ప్రభావం : క్రిప్టో కరెన్సీలపై అనిశ్చితి పెరుగుతున్నందున చాలామంది పెట్టుబడిదారులు మళ్లీ సంప్రదాయ ఆస్తులైన బంగారంపై దృష్టి సారించారు. బిట్‌కాయిన్ మార్కెట్‌లోని అస్థిరత, కొత్త నియంత్రణలు, మరియు చైనా వంటి దేశాల్లో క్రిప్టో ట్రేడింగ్‌పై నిషేధాలు కూడా బంగారం మార్కెట్‌ను పరోక్షంగా బలపరచాయి.దీంతో ఈ ఏడాది బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి.

భవిష్యత్తులో బంగారం ధర ఎటు? : మార్కెట్ విశ్లేషకుల ప్రకారం బంగారం ధర 2025 చివరి నాటికి రూ. 1.30 లక్షల మార్క్‌ను దాటే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌కు రూ.3,000 వరకు చేరవచ్చని అంచనా. భారతదేశంలో వచ్చే పండుగ సీజన్, వివాహ కాలం, బ్యాంకుల డిమాండ్ కూడా దీన్ని మరింత పెంచవచ్చు. అయితే, ధరలు ఈ స్థాయిలో కొనసాగుతాయా లేదా అనేది అమెరికా ఫెడరల్ పాలసీలు, డాలర్ దిశ, మరియు గ్లోబల్ రాజకీయ స్థిరత్వంపై ఆధారపడి ఉంటుంది.

బంగారం కొనుగోలుపై నిపుణులు సలహా : బంగారం ధరలు ఇప్పట్లో తగ్గేలా లేవు. వివిధ బ్రోకరేజ్ సంస్థలు కూడా బంగారం ధర పెరుగుతూనే ఉంటుందని అంచనా వేస్తున్నాయి. గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థలు గోల్డ్‌మన్ సాచ్స్, సిటీగ్రూప్, మోర్గాన్ స్టాన్లీ వంటి నిపుణులు బంగారం పెట్టుబడిని పెంచాలని, మరింత బంగారం కొనాలని నిరంతరం చెబుతున్నారు. అలాగే బంగారంలో పెట్టుబడి పెట్టడాన్ని వ్యతిరేకించిన వారెన్ బఫెట్ కూడా బంగారం కొనమని సలహా ఇస్తున్నారు. బంగారం ధర పెరుగుతూనే ఉంటుందనే నిఫుణుల అభిప్రాయాలతో సామాన్యులో ఒక రకమైన భయం నెలకొందని చెప్పవచ్చు.

బంగారం ధర ఎప్పుడైనా తగ్గుతుందా?: బంగారం ధర తగ్గాలంటే, చైనా బంగారం కొనడం మానేయాలి, వివిధ దేశాల మధ్య యుద్ధాలు ముగియాలి, స్టాక్ మార్కెట్లు, బాండ్లు లాభదాయకంగా మారాలి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరపడాలి. ఇవన్నీ ప్రస్తుతానికి జరిగే అవకాశం ఉందో లేదో ఖచ్చితంగా తెలియదు. అందువల్ల, బంగారం ధర పెరుగుతుంది. అది తగ్గినప్పటికీ, పెద్దగా తగ్గుదల ఉండదు. ఇది రూ. 1000 నుండి రూ. 2000 వరకు తగ్గవచ్చని అంతకంటే ఎక్కువగా తగ్గే అవకాశం లేదని చెబుతున్నారు.

సంవత్సరం ధర (24 karat per 10 grams)
1964 Rs.63.25
1965 Rs.71.75
1966 Rs.83.75
1967 Rs.102.50
1968 Rs.162.00
1969 Rs.176.00
1970 Rs.184.00
1971 Rs.193.00
1972 Rs.202.00
1973 Rs.278.50
1974 Rs.506.00
1975 Rs.540.00
1976 Rs.432.00
1977 Rs.486.00
1978 Rs.685.00
1979 Rs.937.00
1980 Rs.1,330.00
1981 Rs.1,800.00
1982 Rs.1,645.00
1983 Rs.1,800.00
1984 Rs.1,970.00
1985 Rs.2,130.00
1986 Rs.2,140.00
1987 Rs.2,570.00
1988 Rs.3,130.00
1989 Rs.3,140.00
1990 Rs.3,200.00
1991 Rs.3,466.00
1992 Rs.4,334.00
1993 Rs.4,140.00
1994 Rs.4,598.00
1995 Rs.4,680.00
1996 Rs.5,160.00
1997 Rs.4,725.00
1998 Rs.4,045.00
1999 Rs.4,234.00
2000 Rs.4,400.00
2001 Rs.4,300.00
2002 Rs.4,990.00
2003 Rs.5,600.00
2004 Rs.5,850.00
2005 Rs.7,000.00
2007 Rs.10,800.00
2008 Rs.12,500.00
2009 Rs.14,500.00
2010 Rs.18,500.00
2011 Rs.26,400.00
2012 Rs.31,050.00
2013 Rs.29,600.00
2014 Rs.28,006.50
2015 Rs.26,343.50
2016 Rs.28,623.50
2017 Rs.29,667.50
2018 Rs.31,438.00
2019 Rs.35,220.00
2020 Rs.48,651.00
2021 Rs.48,720.00
2022 Rs.52,670.00
2023 Rs.52,790.00
2024 Rs.73,780.00
2025 Rs.1,24,260.00

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+