Gold Price Today: దేశంలోని ప్రజలు ఎన్నడూ చూడని రేట్లకు పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. తాజాగా 10 గ్రాముల ధర రూ.74,000 మార్కును అధిగమించింది. ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతారవణంతో పసిడి ధరల పెరుగుదలకు ఆజ్యం పోస్తున్నాయి.
22 క్యారెట్ల పసిడి ధరలు 10 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.550 నేడు పెరిగింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.67,900, ముంబైలో రూ.67,050, దిల్లీలో రూ.67,200, కలకత్తాలో రూ.67,050, బెంగళూరులో రూ.67,050, కేరళలో రూ.67,050, వడోదరలో రూ.67,100, జైపూరులో రూ.67,200, లక్నోలో రూ.67,200, నాశిక్ లో రూ.67,080, అయోధ్యలో రూ.67,200, బళ్లారిలో రూ.67,050, గురుగ్రాములో రూ.67,200, నోయిడాలో రూ.67,200 వద్ద కొనసాగుతున్నాయి.

24 క్యారెట్ల పసిడి ధరలు సైతం భారీ స్థాయిలో పెరగటంతో నేడు రికార్డు గరిష్ఠమైన రూ.74 వేల మార్కును అధిగమించింది. ఇదే క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.74,070, ముంబైలో రూ.73,150, దిల్లీలో రూ.73,300, కలకత్తాలో రూ.73,150, బెంగళూరులో రూ.73,150, కేరళలో రూ.73,150, వడోదరలో రూ.73,200, జైపూరులో రూ.73,300, లక్నోలో రూ.73,300, నాశిక్ లో రూ.73,180, అయోధ్యలో రూ.73,300, బళ్లారిలో రూ.73,150, గురుగ్రాములో రూ.73,300, నోయిడాలో రూ.73,300గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.67,050గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,150 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.500 పెరిగి రూ.89,500 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications