Gold Rates Crash Rs 34900 in 8 Days: జూన్ నెల బంగారం ధరలు పెరుగుదల, తగ్గుదల మధ్య దోబూచులాడాయి. ceasefireకు ముందు భారీగా పెరిగిన పసిడి ధరలు ఆ తర్వాత పతనం అయ్యాయి. జూన్ నెలలో క్రమంగా పడిపోతూ వచ్చిన బంగారం ధరలు నెల చివర్లో భారీ తగ్గుదలను నమోదు చేశాయి. ముఖ్యంగా 24 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములకు రూ.34,900 పడిపోవడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఇది ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం ముగిసిన తర్వాత తగ్గిన తగ్గుదలగా మనం చెప్పుకోవచ్చు. జూన్ 23 నుంచి 30 వరకు అంటే కేవలం 8 రోజుల్లోనే పసిడి ధరలో ఈ భారీ తగ్గింపు చోటు చేసుకుంది.
జూన్ 24న ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ చేసిన తర్వాత బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆ రోజు 100 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.14,700 తగ్గింది. ఆ తరువాత రోజుల్లో కూడా వరుసగా పసిడి ధరలు తగ్గిపోతూనే ఉన్నాయి. జూన్ 30న 24 క్యారెట్ల ధర రూ.1,600 పడిపోయి 100 గ్రాములకు రూ.9,72,600గా ఉంది. అదే రోజు 22 క్యారెట్ల బంగారం 100 గ్రాములకు రూ.1,500 పడిపోయి రూ.8,91,500కు చేరుకుంది.

MCXపై కూడా స్వల్పంగా బంగారం ధర తగ్గింది. ఆగస్ట్ 2025 ఎక్స్‌పైరీ గల గోల్డ్ ఫ్యూచర్ రూ.36 పెరిగి రూ.96,111 వద్ద ముగిసింది. సిల్వర్ ధరలు కూడా జూన్ నెల చివర్లో రూ.1,05,451కు చేరుకున్నాయి. LKP సెక్యూరిటీస్ విశ్లేషకుడు జతీన్ త్రివేది వెల్లడించిన ప్రకారం, డాలర్ ఇండెక్స్ బలహీనపడటం కారణంగా బంగారం తిరిగి పుంజుకున్నా.. గతవారం ఎదురైన ప్రాఫిట్ బుకింగ్ వల్ల అది తగ్గుముఖం పట్టిందన్నారు. ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో బంగారం ధరలు రూ.94,000 - రూ.97,500 మధ్య ట్రేడయ్యే అవకాశముందని ఆయన చెప్పారు.
ఇదిలా ఉండగా, జూలై మొదటి వారంలో అమెరికా నుండి వచ్చే కీలక ఆర్థిక సమాచారంతో పాటుగా, ADP నాన్-ఫార్మ్ ఎంప్లాయ్‌మెంట్, నాన్-ఫార్మ్ పేరోల్స్, నిరుద్యోగ శాతం వంటి డేటాలు బంగారం ధరలపై భవిష్యత్తులో ప్రభావం చూపనున్నాయి. అదే సమయంలో అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందాలు, ట్రేడ్ టారిఫ్ అప్‌డేట్లు కూడా పసిడి మార్కెట్‌లో సంచలనం సృష్టించే అవకాశముంది.
అమెరికా సుంకాల గడువు జూలై 9న వస్తున్నందున రాబోయే రోజుల్లో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.డాలర్ బలహీనపడటం, ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న రాజకీయ పరిస్థితులు తగ్గుముఖం పట్టడం, పశ్చిమాసియా దేశాల్లో తగ్గిన ఉద్రిక్తతలు వంటి వాటితో బంగారం ధరలు ఈ సారి తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Disclaimer: The write-up is just for information purposes, and is not a recommendation to buy, sell or hold. We have not done fundamental or technical analysis and have no opinion on article mentioned. Neither, the author, GoodReturns.In nor Greynium Information Technologies should be held liable for any losses. Please consult a professional advisor.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications