బంగారం ప్రియులకు ఎగిరి గంతేసే వార్త వచ్చేసింది. పసిడి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ట్రంప్ చేసిన ఒక్క ప్రకటనతో బంగారం ధరలు దాదాపు రూ. 14 వేలకు పైగా తగ్గాయి. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక విషయాన్ని వెల్లడించిన సంగతి విదితమే. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పదం జరిగిందని తెలిపారు. దీంతో దేశీయంగా, అంతర్జాతీయంగా బంగారం ధరలు నేల చూపులు చూశాయి. ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడి దారులు బంగారం నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దీంతో బంగారం, వెండి వంటి సురక్షిత పెట్టుబడి ఆస్తులపై డిమాండ్ తగ్గింది.
ఈ మధ్య వరుసగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ తగ్గుదల సామాన్యులతో పాటుగా వ్యాపారలకు ఊరట కలిగిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడు సామాన్యులు కూడా బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు రేట్లు తగ్గినప్పటికీ బంగారం ధరలు భవిష్యత్తులతో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు పెట్టుబడిదారులు యూఎస్ డాలర్ మీద ఫోకస్ పెట్టారు. అయితే భవిష్యత్తులో మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటే పెట్టుబడిదారులు బంగారం వైపు తమ ఇన్వెస్ట్ మళ్లించే అవకాశం ఉంది. దీంతో బంగారం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ఇక భారతదేశంలో బంగారం ధరలు: 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,470 తగ్గి రూ. 99,220 కి చేరింది. అంటే గ్రాముకు రూ. 9,922 (తగ్గుదల రూ. 147) వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,350 తగ్గి రూ. 90,950 కి చేరింది.గ్రాము రూ. 9,095 (తగ్గుదల రూ.135) వద్ద ట్రేడవుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,100 తగ్గి రూ. 74,420 కి చేరింది. అంటే గ్రాము రూ. 7,442 (తగ్గుదల రూ. 110) పలుకుతోంది. ఇక 100 గ్రాముల ధరలు విషయానికి వస్తే.. 24 క్యారెట్ ధర రూ. 9,92,200 (తగ్గుదల రూ. 14,200)గా ఉంది.22 క్యారెట్ ధర రూ. 9,09,500 (రూ. తగ్గుదల 13,500)గా ఉంది. 18 క్యారెట్ ధర రూ.7,44,200 (తగ్గుదల రూ.1,100)గా ఉంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన ప్రకారం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య 12 రోజుల యుద్ధానికి శాంతి ఒప్పందం కుదిరింది. ఈ పరిణామంతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల్లో భయాందోళన తగ్గింది. దీంతో సురక్షిత పెట్టుబడులపై కూడా వారికి ఆసక్తి తగ్గింది.Kedia Advisory ప్రకారం, బంగారం ధరలు రూ. 3,350 దిగువకు వచ్చాయి. మరో సంస్థ Reliance Securities ప్రకారం, బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గింది.ఇప్పుడు వారు ఫెడరల్ రిజర్వ్ పాలసీపై దృష్టి కేంద్రీకరిస్తున్నారని తెలిపింది.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఇరాన్ అధికారులు కాల్పుల విరమణపై ఒప్పందాన్ని అంగీకరించినప్పటికీ మెలిక పెట్టారు. టెహ్రాన్ నుండి వచ్చిన కొన్ని నివేదికల ప్రకారం.. ఇజ్రాయెల్ సైనిక చర్యలను నిలిపివేయడంపై మా విరమణ ఒప్పందం ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications