2026 చివరి నాటికి బంగారం ధరలు కుప్పకూలడం ఖాయం.. తాజా నివేదికలో సంచలన విషయాలు..
2026 మూడవ త్రైమాసికం నాటికి ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధరల గమనంపై స్పష్టమైన అంచనాలు వెలువడ్డాయి. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు, రాబోయే రోజుల్లో మరిన్ని సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయని WisdomTree నివేదిక తెలిపింది. గోల్డ్ ప్రైస్ మోడల్ ఆధారంగా రాబోయే కాలానికి మూడు రకాల భవిష్యత్తు ఆర్థిక పరిస్థితులను ఈ నివేదిక అంచనా వేసింది.
మొదటిగా, ఆర్థికవేత్తల సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించిన సగటు అంచనా ప్రకారం.. బంగారం ధర తొలిసారిగా 4,000 డాలర్ల మార్కును దాటి, 2026 సెప్టెంబర్ నాటికి ఒక ట్రాయ్ ఔన్సుకు 4,530 డాలర్ల స్థాయికి చేరుకోవచ్చు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం, ద్రవ్యోల్బణం స్థిరంగా పెరగడం, డాలర్ విలువ స్వల్పంగా బలహీనపడటం వంటి అంశాలు ఈ రకమైన పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తాయి.

రెండవదైన గరిష్ట లాభాల అంచనా ప్రకారం, ఒకవేళ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత వేగంగా తగ్గిస్తూ దూకుడుగా వ్యవహరిస్తే ద్రవ్యోల్బణం దాదాపు 5 శాతం వరకు పెరిగే ప్రమాదం ఉంది. ఇటువంటి అనుకూల పరిస్థితుల్లో, డాలర్ ఇండెక్స్ 89 పాయింట్ల స్థాయికి పడిపోవడం, ఇన్వెస్టర్లు బంగారంలో భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల, 2026 సెప్టెంబర్ నాటికి బంగారం ధర ఔన్సుకు 5,260 డాలర్ల మార్కును కూడా దాటి సరికొత్త చరిత్ర సృష్టించవచ్చు.
మూడవదైన ధరల తగ్గుదల అంచనా ప్రకారం.. ఒకవేళ అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి కఠినమైన చర్యలు తీసుకుని, దానిని 2 శాతం లక్ష్యానికి చేరిస్తే మార్కెట్ భిన్నంగా స్పందిస్తుంది. వడ్డీ రేట్లు పెరగడం వల్ల బాండ్ల రాబడులు 6.50 శాతానికి చేరడం, అలాగే యూఎస్ డాలర్ ఇండెక్స్ 113 కి బలోపేతం కావడం వల్ల సురక్షిత ఆస్తిగా బంగారానికి ఉన్న ఆకర్షణ తగ్గిపోయి, 2026 క్యూ3 నాటికి Gold ధరలు ఔన్సుకు 3,140 డాలర్లకు పడిపోయే అవకాశం కూడా ఉంది.
ఈ ధరల అంచనాలతో పాటు, దీర్ఘకాలంలో బంగారానికి మద్దతునిచ్చే కొన్ని ముఖ్యమైన అంతర్గత శక్తులను కూడా WisdomTree తెలిపింది . ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు డాలర్ నిల్వలను తగ్గించుకుంటూ, రికార్డు స్థాయిలో నిధులని బంగారాన్ని కొనుగోలు చేయడానికి కేటాయిస్తున్నాయి, దీనివల్ల ప్రస్తుతం అధికారిక నిల్వలలో బంగారం వాటా 26 శాతం దాటినట్లు అంచనా. దీనికి తోడు అమెరికా యొక్క జంట లోటులు అనగా కోశ లోటు మరియు కరెంట్ అకౌంట్ లోటు కాలక్రమేణా డాలర్ విలువను క్షీణింపజేస్తుండటం అంతర్జాతీయంగా బంగారానికి పెద్ద వరంగా మారింది.
మొత్తంగా చూస్తే.. ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల దృష్ట్యా, రాబోయే 2026 చివరి నాటికి Gold ధరలు గరిష్టంగా ఔన్సుకు 4,500 డాలర్ల నుండి 5,200 డాలర్ల మధ్య ట్రేడ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఈ విశ్లేషణ స్పష్టం చేస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
